
తాజా వార్తలు
22 కరోనా టెస్టులు: ఆందోళన పడ్డ దాదా
ఇంటర్నెట్‌డెస్క్: మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తన విధులను నిర్వర్తిస్తూ గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. యూఏఈ వేదికగా ఐపీఎల్ పదమూడో సీజన్ నిర్వహించడంతో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు గంగూలీ లీగ్ పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘‘గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. ఒక్కసారి కూడా పాజిటివ్ రాలేదు. నా పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఉండటంతో పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. అయితే నేను.. మా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను. లీగ్ ఆరంభంలో దుబాయ్‌కు వెళ్లి వచ్చిన సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యా. నా వల్ల ఇతరులకు ఎక్కడ కరోనా వ్యాప్తి జరుగుతుందోనని భయపడ్డాను’’ అని వర్చువల్ మీడియా సమావేశంలో దాదా పేర్కొన్నాడు.
అయితే బయోబబుల్‌లో దాదాపు 400 మంది ఆటగాళ్లు, సిబ్బందితో ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించామని గంగూలీ అన్నాడు. లీగ్ నిర్వహణ సమయంలో సుమారు 30-40 వేల పరీక్షలు చేయించామని తెలిపాడు. ఐపీఎల్ భారత్‌కు ఎంతో కీలకమని, ప్రజలు లీగ్ విజయం గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. కాగా, దేశవాళీ క్రికెట్‌ను అతి త్వరలో తిరిగి ఆరంభిస్తామని, అలాగే వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌కు ఆతిథ్యం ఇస్తామని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనుందని తెలిపాడు. అయితే తొమ్మిది, పది జట్లతో మ్యాచ్‌లను నిర్వహించడం కంటే రెండు జట్ల ఆటగాళ్లకు ఏర్పాట్లు చేయడం సులువని అభిప్రాయపడ్డాడు. మహమ్మారి సెకండ్ వేవ్ గురించి వింటున్నామని, ముంబయి, దిల్లీలో కేసులు పెరుగుతున్నాయని అన్నాడు. ఈ నేపథ్యలో మరిన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తామని దాదా అన్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్ల గురించి గంగూలీ మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లు ఆరోగ్యంగా, ఫిట్నెస్తో ఉన్నారు. ఆస్ట్రేలియాలో కొవిడ్ కేసులు ఎక్కువగా లేవు. అక్కడి సరిహద్దులను కొంతకాలం మూసివేశారు. అంతర్జాతీయ ప్రయాణాలు ఆసీస్‌లో అంత సులువు కాదు. 14 రోజుల క్వారంటైన్ నిబంధలను కచ్చితంగా పాటించాలి’’ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా నవంబర్ 27న తొలి వన్డే జరగనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
