close
Array ( ) 1

తాజా వార్తలు

ఐపీఎల్‌ను తప్పక నిర్వహిస్తారు: స్టీవ్‌ స్మిత్

దిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు. కానీ దేశంలో మహమ్మారి వేగంగా వ్యాప్తిస్తుండటంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ను కచ్చితంగా నిర్వహిస్తారని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘‘ప్రస్తుతం ప్రపంచం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ ఏడాది ఏ సందర్భంలోనైనా ఐపీఎల్‌ను సాధ్యమైనంత వరకు నిర్వహిస్తారని ఆశిస్తున్నా. రాజస్థాన్‌ రాయల్స్‌కు రెండు సీజన్లలో నేను కొన్ని మ్యాచ్‌లకే కెప్టెన్సీ చేశాను. 2015లో షేన్‌ వాట్సన్‌ నుంచి బాధ్యతలు అందుకున్నా. ఆ తర్వాత గత సీజన్‌ ఆఖర్లోనూ కెప్టెన్సీ చేశాను. గొప్ప జట్టు అయిన రాజస్థాన్‌ రాయల్స్‌కు పూర్తి సీజన్‌ నాయకత్వం వహించాలని ఎదురుచూస్తున్నా’’ అని స్మిత్‌ తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.