close
Array ( ) 1

తాజా వార్తలు

అప్పుడే.. బుమ్రాను మర్చిపోతారా: షమి

ముంబయి: మూడు వన్డేల్లో వికెట్లు తీయనంత మాత్రాన జస్ప్రీత్‌ బుమ్రా అందించిన విజయాలను ఎలా మర్చిపోతారని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి ప్రశ్నించాడు. ఏ ఆటగాడైనా గాయపడి తిరిగొచ్చిన వెంటనే రాణించడం సులువు కాదని పేర్కొన్నాడు. తన సహచరుడికి అండగా నిలిచాడు.

‘2-4 మ్యాచుల్లో బాగా ఆడకపోతేనే దీనిపై చర్చించడాన్ని నేను అర్థం చేసుకోగలను. ఓ రెండు మ్యాచుల్లో వికెట్లు తీయనంత మాత్రాన మ్యాచులను గెలిపించే బుమ్రా సత్తాను ఎలా మర్చిపోతారు. అతడు సాధించింది అంతా పక్కన పెట్టేస్తారా? మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఆ ఆటగాడికి మంచిది. అది అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. గాయం నుంచి కోలుకొని వెంటనే రాణించడం కష్టమని ఒక క్రీడాకారుడిగా నాకు తెలుసు. వ్యాఖ్యానాలు చేస్తూ డబ్బులు సంపాదించేవారికి విమర్శించడం సులభం. ఆటగాళ్లకు గాయాలు సహజం. 2015లో నేనూ గాయపడ్డాను. ఆ తర్వాత పుంజుకున్నాను’ అని షమి అన్నాడు.

యువ పేసర్‌ నవదీప్‌ సైనికి మార్గనిర్దేశం చేయడం ముఖ్యమని షమి భావిస్తున్నాడు. ‘అనుభవం కీలకం. అప్పుడే నిర్భయంగా ఉండగలరు. భిన్న పరిస్థితులను ఎదుర్కోవడం అవసరం. ఆ అనుభవం ఎంతో విలువైనది. ఒక యువ ఆటగాడి వెనక సీనియర్‌ ఉన్నప్పుడు అతడు త్వరగా పరిణతి సాధిస్తాడు. మా జట్టులో మేము యువకులకు మార్గనిర్దేశం చేస్తాం. వారితో మాట్లాడతాం. జోకులు వేస్తాం. సైని పొడగరి. అతడిలో ప్రతిభ, వేగం ఉన్నాయి. అతడికి సుదీర్ఘ కాలం సీనియర్ల మద్దతు అవసరం. అతడు చాలా బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. కానీ అనుభవం వెంటనే రాదు. మేమంతా అతడికి సాయం చేస్తున్నాం. న్యూజిలాండ్‌ XIతో ఆడుతున్న పిచ్‌ చాలా బాగుంది. బౌలింగ్‌కు అనుకూలిస్తోంది’ అని షమి వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.