close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120046302 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1247058909228969990 [video_short_link] => 1247058909228969990 [created_by] => [created_date] => [modified_by] => 8925411 [modified_date] => 2020-04-06 23:16:12.66334 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 07/04/2020 00:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

సచిన్‌ను నాటౌట్‌గా ఎలా ప్రకటిస్తారు?

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటాడు. క్రికెట్‌లో తన జ్ఞాపకాలు, అనుభవాలు, అభిప్రాయాలను అభిమానులతో తరచుగా పంచుకుంటాడు. తాజాగా 1998లో జరిగిన భారత్‌×ఆసీస్‌ టెస్టు మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందుల్కర్‌ (155*) అజేయ శతకంతో చెలరేగగా టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్‌ మీడియలో చక్కర్లు కొడుతుండటంతో వార్న్‌ స్పందించాడు. సచిన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆదిలోనే ఔట్‌ అని ట్వీట్‌ చేశాడు.

‘‘ఇది ఔటా? నాటౌటా? భారత్×ఆసీస్‌ తొలి టెస్టులో సచిన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అజేయంగా 155 పరుగులు చేశాడు. అయితే ఆదిలోనే సచిన్‌ ఎల్బీడబ్ల్యూగా షేన్‌వార్న్‌ అప్పీలు చేశాడు. కానీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ అంపైర్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరూ ఊహించలేరు. ఆ సమయంలో హాక్‌-ఐ ఉంటే బాగుండేది’’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీనికి షేన్‌వార్న్‌ ‘అది నాటౌట్‌ ఎలా అవుతుంది?’ అని బదులిచ్చాడు. 1998లో ఆసీస్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. సచిన్‌ తొలి టెస్టులోనే కాకుండా ఆఖరి టెస్టులోనూ (177) శతకం సాధించాడు.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.