close

తాజా వార్తలు

సవాళ్లకు వెనకడుగు వేయను: పొలార్డ్‌

ముంబయి: సవాళ్లను చూసి వెనకడుగు వేయనని వెస్టిండీస్‌ సారథి కీరన్‌ పొలార్డ్‌ అన్నాడు. ‘దీర్ఘకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాను. బోర్డుతో ఉన్న ఇబ్బందులతోనూ ఇతర కారణాల వల్ల మూడు నుంచి నాలుగు ఏళ్లు జట్టుకు దూరమయ్యాను. దీనిలో రహస్యంగా ఉంచేది ఏమీ లేదు. నా పని ఎంతో సులువైనది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో నా అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకుంటాను. వారికి మార్గనిర్దేశం అవసరం. వారిని సరైన మార్గంలో నడపించడమే నా కర్తవ్యం. వెస్టిండీస్‌ తరఫున ఆడాలని భావించాను. కానీ, జట్టుకు సారథ్యం వహించాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని చూసి వెనకడుగు వేయను’ అని తెలిపాడు.

భారత్‌ పర్యటనలో వెస్టిండీస్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 డిసెంబర్‌ 6న ఉప్పల్‌లో జరగనుంది. రెండో టీ20 డిసెంబర్‌ 8న తిరువనంతపురంలో, ఆఖరి టీ20 డిసెంబర్ 11న ముంబయిలో జరగనుంది. డిసెంబర్ 15న చెన్నై వేదికగా తొలి వన్డే, డిసెంబర్‌ 18న విశాఖపట్నంలో రెండో వన్డే, ఆఖరి వన్డే డిసెంబర్ 22న కటక్‌లో జరగనుంది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను వెస్టిండీస్‌ 1-2 తేడాతో కోల్పోయింది. ఏకైక టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.