ధోనీ చేతుల్లో రైనా ‘పునరాగమనం’!

తాజా వార్తలు

Published : 02/09/2020 19:45 IST

ధోనీ చేతుల్లో రైనా ‘పునరాగమనం’!

తాను నిర్ణయం తీసుకోనన్న శ్రీనివాసన్‌

చెన్నై: క్రికెటర్‌ సురేశ్‌ రైనాను ఒక కుమారుడిగా చూసుకున్నానని చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌ అన్నారు. జట్టులో అతడి పునరాగమనంపై మాత్రం తాను నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. ఈ వ్యవహారాలన్నీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథనే చూసుకుంటారని పేర్కొన్నారు. తమకు జట్టే సొంతమని ఆటగాళ్లు కాదని స్పష్టం చేశారు. పీటీఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.

వ్యక్తిగత సమస్యలతో ఐపీఎల్‌-2020కి సురేశ్‌ రైనా దూరమైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీనివాసన్‌ అతడిపై తీవ్రంగా విమర్శలు చేశారు. విజయగర్వం తలకెక్కకూడదని మందలించారు. అయితే ఆ తర్వాత మెత్తబడ్డారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ అంతా ఒక కుటుంబమని, అతడికి అండగా ఉంటామన్నారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని యూటర్న్‌ తీసుకున్నారు. కుటుంబం కోసమే భారత్‌కు వచ్చానని, శ్రీని తనను కొడుకులా చూసుకున్నారని, మళ్లీ దుబాయ్‌కి వెళ్లినా ఆశ్చర్యం లేదని రైనా బుధవారం పేర్కొనడం గమనార్హం.

‘ఒక కొడుకులా రైనాను చూసుకున్నా. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇంత విజయవంతం అయ్యిందంటే.. క్రికెట్‌ సంబంధ వ్యవహారాల్లో ఫ్రాంచైజీ తలదూర్చకపోవడమే కారణం. 1960 నుంచే ఇండియా సిమెంట్స్‌ క్రికెట్‌ను నడుపుతోంది. నేనెప్పుడూ అలాగే ఉంటా’ అని శ్రీనివాసన్‌ అన్నారు. ఈ ఐపీఎల్‌ ఆడేందుకు రైనా మళ్లీ దుబాయ్‌ వస్తాడా అని ప్రశ్నించగా..

‘రైనా వస్తాడా లేదా అన్నది నా పరిధిలో లేని అంశం. వాటిని నేను చూసుకోను. మాకు జట్టు ఉంది. ఫ్రాంచైజీ మాత్రమే మా సొంతం. క్రికెటర్లు కాదు. నేనేమీ క్రికెట్‌ జట్టు సారథి కాను. ఎవరు ఆడాలి? వేలంలో ఎవరిని తీసుకోవాలి? వంటివి చెప్పను. మాకు అత్యుత్తమ కెప్టెన్‌ ఉన్నాడు. అలాంటప్పుడు క్రికెట్‌ వ్యవహారాల్లోనే నేనెందుకు జోక్యం చేసుకువాలి?’ అని శ్రీనివాసన్‌ ప్రశ్నించారు.

ఇవీ చదవండి

రూ.12.5 కోట్లను ఊరికే వదిలేస్తానా: రైనా

అమ్మో.. దుబాయ్‌ వేడిలో కష్టం: రికీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని