close
Array ( ) 1

తాజా వార్తలు

ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమే కానీ..

ముంబయి: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమవుతుందని, కానీ పూర్తి తరహాలో కాకుండా ‘మినీ ఐపీఎల్‌’ లాగా నిర్వహించవచ్చని రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని మనోజ్‌ బదలే అభిప్రాయపడ్డారు. 

‘‘ఈ ఏడాది ప్రత్యేక తరహాలోనైనా ఐపీఎల్‌ ఉంటుందని ఆశిస్తున్నా. మినీ ఐపీఎల్‌ కూడా నిర్వహించవచ్చు. ప్రజలంతా సృజనాత్మకంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. బోర్డు సభ్యులంతా కలిసి టోర్నీని నిర్వహించడానికి ప్రయత్నించాలి. క్రికెట్‌కు ఈ టోర్నీ ఎంతో ముఖ్యం. ఐపీఎల్ వల్ల ఎంతో మంది దేశీయ ఆటగాళ్లకు చేకూరుతుంది. అంతేకాక స్టార్‌ ఆటగాళ్లు, నిర్వహకులు, బ్రాడ్‌కాస్టర్స్‌కు ఆర్థికంగా దోహదపడుతుంది. ఇది ఎంతో మందికి జీవనోపాధి. టోర్నీని నిర్వహించడం మా బాధ్యత. నిర్వహణ కోసం సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం’’ అని మనోజ్‌ అన్నారు.

మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. కానీ దేశంలో మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో ఐపీఎల్‌ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.