దుబాయ్‌లోనే ఐపీఎల్‌-2020
close

తాజా వార్తలు

Published : 22/07/2020 02:06 IST

దుబాయ్‌లోనే ఐపీఎల్‌-2020

స్పష్టం చేసిన ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులకు మరో శుభవార్త! ఐపీఎల్‌-2020 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో స్పష్టత లభించినట్టే. అక్టోబర్‌-నవంబర్‌లో దుబాయ్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ వేడుక నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ అన్నట్టు తెలిసింది. పూర్తి లీగు జరుగుతుందని, 60 మ్యాచులు ఉంటాయని సమాచారం.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడటంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. కరోనా వైరస్‌ కారణంగా మార్చిలో జరగాల్సిన టోర్నీ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే ఆసియాకప్‌, ప్రపంచకప్‌ వాయిదాతో అక్టోబర్‌లో నిర్వహించేందుకు అవకాశం బీసీసీఐకి లభించింది. మొదట భారత్‌లోనే నిర్వహించాలని భావించినా పరిస్థితులు మెరుగయ్యేలా కనిపించడం లేదు. అందుకని భారతీయులు టీవీల్లో చూసేందుకు వీలుగా దుబాయ్‌కు టోర్నీని తరలిస్తున్నారు.

‘వారం పది రోజుల్లో ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం అవుతుంది. పూర్తి షెడ్యూలుపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పుడు 60 మ్యాచులతో యూఏఈలో పూర్తి స్థాయిలో ఐపీఎల్‌ నిర్వహించడంపై దృష్టిసారిస్తాం’ అని బ్రిజేష్‌ పటేల్‌ అన్నారని తెలిసింది. ఇక విదేశీ ఆటగాళ్లు నేరుగా దుబాయ్‌కే వస్తారని సమాచారం. ‘మన ఆటగాళ్లకు కనీసం మూడు నుంచి నాలుగు వారాల శిక్షణ అవసరం. బీసీసీఐ తేదీలు ప్రకటించగానే మా ప్రణాళికలపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా యూఏఈలో నిర్వహణపై ఐపీఎల్‌ పాలక మండలి అధికారిక సమాచారం వస్తే పూర్తి స్పష్టత వస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని