అమ్మో.. దుబాయ్‌ వేడిలో కష్టం: రికీ

తాజా వార్తలు

Published : 02/09/2020 17:25 IST

అమ్మో.. దుబాయ్‌ వేడిలో కష్టం: రికీ

అతి సాధన వద్దని సూచించిన దిల్లీ కోచ్‌

(Image/twitter)

దుబాయ్‌: ఎడారి వేడిలో అతిగా సాధన చేయడం మంచిది కాదని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అంటున్నాడు. ప్రతి సెషన్‌ తర్వాత అలసటను బట్టి తర్వాతి సెషన్‌కు సమయం నిర్దేశించుకుంటామని పేర్కొన్నాడు. శిబిరంలో తక్కువ మందే ఆటగాళ్లు ఉండటంతో జాగ్రత్తగా కసరత్తులు చేయాలని సూచించాడు. సీనియర్‌ ఆటగాళ్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానెల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. తొలి సాధనా శిబిరం తర్వాత జట్టు పరిస్థితులను ఆయన మదింపు చేశాడు.

‘మేం చాలా తక్కువ మందిమే ఇక్కడికొచ్చాం. గతేడాదికి భిన్నంగా మా శిక్షణ సెషన్లు ఉండాలని కోరుకుంటున్నా. తొలి మూడు వారాల్లో అతిగా సాధనా శిబిరాలు ఉండవని మా కుర్రాళ్లకు చెప్పాను. మొదటి మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేంత వరకు కాస్త సవాలే. అయితే శారీరకంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా మా కుర్రాళ్లను సన్నద్ధం చేయడం అత్యంత ముఖ్యం. తొలి మ్యాచ్‌కు ముందు మేం 20 ట్రైనింగ్‌ సెషన్లు నిర్దేశించుకున్నాం. ఇప్పుడవి ఎక్కువేనని అనిపిస్తోంది. ప్రతి రోజు శిక్షణ తర్వాత పరిస్థితులను సమీక్షిస్తాం’ అని పాంటింగ్‌ అన్నాడు.

గతేడాది ప్రదర్శననే ఈ సారీ పునరావృతం చేయాలనుకుంటున్నట్టు రికీ చెప్పాడు. ఒకసారి విజయవంతమైనప్పుడు ఎందుకు విజయవంతం అయ్యామో అర్థం చేసుకోవడం ముఖ్యమన్నాడు. సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలన్నాడు. బయో బుడగ నిబంధనలను కఠినంగా పాటించేలా చేస్తానన్నాడు. మేనేజ్‌ చేయడమంటే ఆటగాళ్లను నియంత్రణలో ఉంచడం కాదని సమయ పాలన అని పేర్కొన్నాడు. కొత్తగా జట్టులో చేరిన అశ్విన్‌, రహానెపై ఆయన ప్రశంసలు కురింపించాడు.

‘వారిద్దరూ క్లాస్‌ ఆటగాళ్లు. టీమ్‌ఇండియాకు సుదీర్ఘంగా ఆడుతున్నారు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో అశ్విన్‌ ఒకడు. రాజస్థాన్‌ రాయల్స్‌ను రహానె సుదీర్ఘకాలం నడిపించాడు. వారికి ఎంతో నైపుణ్యం, క్లాస్‌, అనుభవం ఉన్నాయి. అవి జట్టుకెంతో అవసరం. మా సారథి యువకుడు. ఇలాంటి సీనియర్ల సహకారం అతడికెప్పుడూ ఉపయోగమే’ అని పాంటింగ్‌ అన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని