close
Array ( ) 1

తాజా వార్తలు

 మోదీపై  అఫ్రిది అక్కసు..

ముంబయి: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదికి మరేం పని లేనట్టుంది. ఎప్పుడూ భారత్‌, కశ్మీర్‌ రాజకీయాల అడ్డగోలు వాదనలు లేవనెత్తుతాడని తెలిసిందే. తాజాగా అతడు ప్రధాని నరేంద్రమోదీపై అవాకులు చవాకులు పేలాడు. రెండు దేశాల ప్రజలు సరిహద్దులు దాటాలని భావిస్తుంటే ఆయనేమో తిరోగమనం వైపు పయనిస్తున్నారని అంటున్నాడు. ఆయన పదవిలో ఉన్నంత వరకు దాయాదుల క్రికెట్‌ సమరం జరగదని బాధపడుతున్నాడు.

భారత్‌, పాక్‌ 2012లో చివరి ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాయి. అప్పుడు పాక్‌ జట్టు ఇక్కడ పర్యటించింది. 2009లో టీమ్‌ఇండియా అక్కడ ఆసియా కప్‌ ఆడింది. ఉగ్రవాదం, భ్రదతా కారణాలతో భారత జట్టు అక్కడ ఆడటం లేదు. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరికట్టేంత వరకు ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు, చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదం గురించి పట్టించుకోకుండా ప్రధాని మోదీ అధికారంలో ఉన్నంత వరకు దాయాదుల మధ్య క్రికెట్‌ ఉండబోదని అఫ్రిది ఆరోపిస్తున్నాడు. పాక్‌ క్రికెట్‌ ఇక ఎదగదేమోనన్న భయం, టీమ్‌ఇండియాపై అసూయ అతడి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి. 

‘మోదీ అధికారంలో ఉన్నంత వరకు భారత్‌ నుంచి మనకెలాంటి స్పందనా రాదు. భారతీయులు సహా మనందరికీ మోదీ ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఆయన తిరోగమన ఆలోచనా ధోరణితో ఉన్నారు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్నవారు ఒకరిదేశంలో మరొకరు ప్రయాణించాలని భావిస్తున్నారు. అసలు మోదీ ఎజెండా ఏంటో, ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థమవ్వడం లేదు’ అని అఫ్రిది అంటున్నాడు. ఉగ్రవాదం, చొరబాట్లు, పాక్‌ ఆర్మీ పదేపదే నిబంధనలు ఉల్లంఘించడంపై మాత్రం అతడు స్పందించకపోవడం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.