close
Array ( ) 1

తాజా వార్తలు

భారత్‌ చేతిలో బంగ్లా అమ్మాయిలు చిత్తు

పెర్త్‌: భారత బౌలర్లు మరోసారి సత్తా చాటడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మరో విజయం సాధించింది. సోమవారం పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (39, 17 బంతుల్లో; 2×4, 4×6), జెమిమా రోడ్రిగ్స్‌ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముర్షిదా (30, 26 బంతుల్లో; 4×4), నిగర్‌ సుల్తానా (35, 26 బంతుల్లో; 5×4) పోరాడారు. ఈ విజయంతో ప్రపంచకప్‌ గ్రూప్‌-ఎ పట్టికలో టీమ్‌ఇండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 

పూనమ్‌ మరోసారి తిప్పేసింది
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఓపెనర్‌ షమిమా (3)ను ఆదిలోనే శిఖ పాండే (2/14) ఔట్ చేసి ఆ జట్టను దెబ్బ తీసింది. కానీ సంజిదా (10)తో కలిసి ముర్షిదా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అయితే అరుంధతి (2/35), పూనమ్‌ (3/18) వీరిద్దరినీ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేర్చారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫాహిమా (17)తో కలిసి నిగర్‌ సుల్తానా (35) రన్‌రేటు తగ్గకుండా జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించసాగింది. భారత బౌలర్లు తిరిగి పుంజుకొని బంగ్లా బ్యాటర్లను క్రమం తప్పకుండా పెవిలియన్‌కు చేర్చారు. ఆఖర్లో జహారానా (10), రుమాన (13) విజయం కోసం పోరాడినా లాభం లేకపోయింది.

షెఫాలీ మెరుపు బ్యాటింగ్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన మ్యాచ్‌కు దూరమవ్వడంతో తానియా భాటియా (2)తో కలిసి షెఫాలీ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయినా భారత్‌ రన్‌రేటు తగ్గలేదు. సెహ్వాగ్‌ శైలిలో షెఫాలీ బౌండరీల మోత మోగిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. అయితే దూకుడుగా ఆడే క్రమంలో పన్నా ఘోశ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి షమిమా చేతికి చిక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్‌ (8) విఫలమైంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మ (11)తో కలిసి జెమిమా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. వీరిద్దరు నిదానంగా ఆడటంతో భారత స్కోరు వేగం తగ్గింది. ఆఖర్లో శిఖ పాండే (7*)తో కలిసి వేదా (20*, 11 బంతుల్లో; 4×4) బ్యాటు ఝళిపించడంతో భారత్‌ 142 పరుగులు చేయగలిగింది. బంగ్లా బౌలర్లో సల్మ (2/25), పన్నా ఘోశ్‌ (2/25) సత్తా చాటారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.