
తాజా వార్తలు
ధోనీ ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది!
ఇంటర్నెట్‌డెస్క్: బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారీ ఛేదనలో ఎంఎస్ ధోనీ నైపుణ్యం, అతడి పాత్రను టీమిండియా ఎంతో మిస్ అవుతుందని వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన 308 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూట్యూబ్ షోలో ఆసీస్×భారత్ మ్యాచ్‌పై హోల్డింగ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
‘‘భారీ స్కోరు ఛేదన అంటే భారత్‌కు క్లిష్టమే. జట్టులో ధోనీ లేకపోవడం టీమిండియాకు కష్టంగా మారింది. సగం మంది పెవిలియన్‌కు చేరిన అనంతరం అతడు క్రీజులోకి వచ్చినా ఛేదనను నియంత్రణలోకి తీసుకొస్తాడు. గతంలో ధోనీ జట్టులో ఉన్నప్పుడు భారత్ గొప్ప విజయాలు సాధించింది. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన స్ట్రోక్‌ప్లే కలిగి ఉన్నారు. హార్దిక్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కోహ్లీ సేనకు ధోనీ వంటి ప్లేయర్ అవసరం. మహీ నైపుణ్యమే కాదు, జట్టులో అతడి పాత్రా ఎంతో కీలకం’’ అని హోల్డింగ్ పేర్కొన్నాడు.
‘‘అంతేగాక ధోనీ జట్టులో ఉంటే టాస్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ధోనీ సామర్థ్యం అందరికీ తెలుసు. ఛేదనలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు కంగారు పడటం మనం చూడలేదు. లక్ష్యాన్ని ఎలా సాధించాలో అతడికి బాగా తెలుసు. తనతో పాటు క్రీజులో ఉండే ఆటగాడికి అతడు సలహాలు ఇస్తూ సాయం చేస్తుంటాడు. కాగా, భారత్‌కు ప్రస్తుతం గొప్ప బ్యాటింగ్ దళం ఉన్నా లక్ష్య ఛేదనలో ధోనీ స్పెషల్ మ్యాన్’’ అని హోల్డింగ్ తెలిపాడు. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ పేలవ ఫీల్డింగ్ చేసిందని, ఎన్నో అవకాశాలు చేజార్చుకుందని అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ క్యాచ్‌లు జారవిడవడంతో పాటు రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
