close

తాజా వార్తలు

Published : 29/10/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌×ఆసీస్‌: షెడ్యూలు వచ్చేసిందోచ్‌!

సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూలు ఖరారైంది. 3 టీ20లు, 3 వన్డేలు, 4 టెస్టుల తేదీలను క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. డిసెంబర్‌ 17న ఆరంభమయ్యే గులాబి టెస్టుకు ముందు సిడ్నీలో అదనంగా మరో డే/నైట్‌ వార్మప్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు సీఏ అంగీకరించింది. నవంబర్‌ 10న యూఏఈ నుంచి టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు బయల్దేరుతారు. నవంబర్‌ 12 నుంచి అక్కడి నిబంధనల ప్రకారం 12 రోజులు క్వారంటైన్‌లో ఉంటూ సాధన చేస్తారు.

కీలకమైన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ డిసెంబర్‌ 17న ఆరంభం అవుతుంది. ఇక బీసీసీఐ డిమాండ్‌ మేరకే బాక్సింగ్‌ డే టెస్టు, కొత్త ఏడాది టెస్టుకు మధ్య వారం రోజుల విరామం ఇస్తున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇక ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ టెస్టు సిరీసు తేదీలనూ సీఏ వెల్లడించింది. టెస్టు సిరీస్‌ తొలి మ్యాచే గులాబి బంతితో జరుగుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఆసీస్‌ నాలుగు గులాబి టెస్టులు ఆడగా అన్నీ గెలిచింది. బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక డే/నైట్‌ టెస్టులో భారత్‌ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే.

వన్డే షెడ్యూలు

(భారత కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు మ్యాచులు ఆరంభం)

తొలి వన్డే శుక్రవారం నవంబర్‌ 27 సిడ్నీ (డే/నైట్‌)
రెండో వన్డే ఆదివారం నవంబర్‌ 29 సిడ్నీ (డే/నైట్‌)
మూడో వన్డే బుధవారం డిసెంబర్‌ 2 కాన్‌బెర్రా (డే/నైట్‌)

టీ20 షెడ్యూలు (మధ్యాహ్నం 1:40 గంటలకు ఆరంభం)

తొలి టీ20 శుక్రవారం డిసెంబర్‌ 4 కాన్‌బెర్రా (నైట్‌)
రెండో టీ20 ఆదివారం డిసెంబర్‌ 6 సిడ్నీ (నైట్‌)
మూడో టీ20 మంగళవారం డిసెంబర్‌ 8 సిడ్నీ (నైట్‌)

టెస్టు సిరీస్‌

తొలి టెస్టు ఉదయం 9:30 గం డిసెంబర్‌ 17-21 ఆడిలైడ్‌ (డే/నైట్‌)
రెండో టెస్టు ఉదయం 5:00 గం డిసెంబర్‌ 26-30 మెల్‌బోర్న్‌
మూడో టెస్టు ఉదయం 5:00 గం జనవరి 7-11 సిడ్నీ  
నాలుగో టెస్టు ఉదయం 5:00 గం జనవరి 15-19 బ్రిస్బేర్న్‌

Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.