close
Array ( ) 1

తాజా వార్తలు

కోహ్లీసేన లొంగిపోవడం ఆశ్చర్యమే: కివీస్‌ కోచ్‌

వెల్లింగ్టన్‌: రెండో టెస్టులో టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంటుందని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ అంచనా వేశారు. తొలి టెస్టులో కోహ్లీసేన అంత సులభంగా లొంగిపోవడం ఆశ్చర్యపరిచిందని అన్నారు. బేసిన్‌ రిజర్వు వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ 165, 191 పరుగులే చేసింది. దాంతో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

‘టీమ్‌ఇండియాను చూసి నాకు ఆశ్చర్యమేసింది. మేం సుదీర్ఘంగా చేసిన ఒత్తిడి మూలంగానే ఇది సాధ్యమైంది. న్యూజిలాండ్‌ వాతావరణం, పరిస్థితుల్లో సౌథీ, బౌల్ట్‌ అద్భుతంగా బంతులు వేస్తారు. ఎనిమిది వారాల విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన బౌల్ట్‌లో ఓ జ్వాల కనిపించింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కన్నా న్యూజిలాండ్‌లో ఆడటం కష్టమన్న భావనను మేం కలిగించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అది మాకు గర్వకారణం’ అని స్టీడ్‌ అన్నారు.

‘మ్యాచులో మేం కీలక సమయాల్లో వికెట్లు తీశాం. నాలుగో రోజు అజింక్య రహానెను త్వరగా ఔట్‌ చేయడం కీలక మలుపు. దాంతో మ్యాచ్‌ను మేం త్వరగా ముగిస్తామని అనుకున్నా. తర్వాతి టెస్టులో భారత ఆటగాళ్లు ఎక్కువ ఆధిపత్యం ప్రదర్శించి మా పేసర్లకు సవాల్‌ విసురుతారని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రపంచ నంబర్‌వన్‌ టీమ్‌ఇండియా బలంగా పుంజుకోగలదు. నీల్‌ వాగ్నర్‌ రావడం మాకో సంతోషకరమైన తలనొప్పి. అరంగేట్రంలోనే జేమీసన్‌ అదరగొట్టాడు. కానీ వాగ్నర్‌ తుది జట్టులో ఉంటాడు. నలుగురు పేసర్లతో పాటు కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ ఉంటే కూర్పు బాగుంటుందని మా నమ్మకం. క్రైస్ట్‌చర్చ తరహా వేదికలు అతడికి నప్పుతాయి’ అని స్టీడ్‌ తెలిపారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.