భారత్‌×ఇంగ్లాండ్‌: వాయిదా వేసిన బీసీసీఐ

తాజా వార్తలు

Published : 07/08/2020 20:19 IST

భారత్‌×ఇంగ్లాండ్‌: వాయిదా వేసిన బీసీసీఐ

ముంబయి: ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరగాల్సిన భారత్‌-ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడింది. ఈ సిరీస్‌ను 2021కి వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కొవిడ్‌-19 ముప్పు తొలగకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. వచ్చే ఏడాది టెస్టు సిరీస్‌ తర్వాత ఈ సిరీస్‌ను కొనసాగిస్తారు. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడతారు.

‘ఇంగ్లాండ్‌తో అన్ని ఫార్మాట్ల షెడ్యూలును ధ్రువీకరించుకొనేందుకే ఈసీబీ, బీసీసీఐ సంపద్రింపులు జరిపాయి. 2021 జనవరి నుంచి మార్చి వరకు ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు భారత్‌లో పర్యటిస్తుంది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘క్రికెట్‌ పునః ప్రారంభం కావడంతో రోజువారీ షెడ్యూలును ఈసీబీ, బీసీసీఐ నిర్ణయించాయి. ప్రపంచ క్రికెట్లో ఎక్కువగా ఎదురుచూసే పోటీల్లో భారత్‌-ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఒకటి. ఈ రెండు జట్లు మైదానంలో తీవ్రంగా పోటీపడి అద్భుతమైన జ్ఞాపకాలను మిగులుస్తాయి’ అని షా అన్నారు.

ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను విజయవంతంగా నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. మార్చిలో జరగాల్సిన టోర్నీని కొవిడ్‌-19 ముప్పుతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో పరిస్థితులు బాగా లేకపోవడంతో సెప్టెంబర్‌ 19-నవంబర్‌ 10 వరకు యూఏఈలో వేదికగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. నిర్వాహక ప్రక్రియను సైతం మొదలుపెట్టింది. అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లకు శిబిరాలు ఏర్పాటు చేసి కొవిడ్‌-19 పరీక్షలు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని