close

తాజా వార్తలు

Published : 16/07/2020 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌×ఇంగ్లాండ్‌ సిరీస్‌ వాయిదా?

ముంబయి: భారత్‌, ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఆగస్టులో జరగాల్సిన న్యూజిలాండ్‌-ఏ పర్యటన సైతం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ మాసంలో ఇంగ్లిష్ జట్టు భారత్‌లో పర్యటించాలి. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో ఇంగ్లాండ్‌ జట్టు ప్రయాణించే సూచనలు కనిపించడం లేదు. అందుకే సిరీస్‌ను వాయిదా వేయక తప్పడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

కరోనా వైరస్‌ ముప్పుతో మార్చి నుంచి భారత్‌లో ఎలాంటి ఆటలు జరగడం లేదు. అభిమానులు లేకుండా టోర్నీలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం చెప్పినప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ సర్వోన్నత మండలి సమావేశం కానుంది. ప్రధానంగా భారత భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) గురించి చర్చిస్తారని తెలిసింది.

‘శుక్రవారం జరిగే సర్వోన్నత మండలి సమావేశంలో ఎఫ్‌టీపీ అంశంపై చర్చించాక భారత్‌-ఇంగ్లాండ్‌ సిరీస్‌ వాయిదాపై అధికారిక ప్రకటన రావొచ్చు. ఆగస్టులో భారత్‌లో న్యూజిలాండ్‌-ఏ పర్యటన సైతం వాయిదా పడొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. పరిస్థితులు మెరుగైతే ఆగస్టులో టీమ్‌ఇండియా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ భావిస్తున్నారని ఆయన అన్నారు. కాగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు భారత పర్యటన వాయిదా పడిందని బ్రిటిష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని