దాదాలా యువకులకు అండగా ఉంటాడు 
close

తాజా వార్తలు

Published : 21/07/2020 01:55 IST

దాదాలా యువకులకు అండగా ఉంటాడు 

విరాట్‌ కోహ్లీపై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీలా యువకులకు అండగా ఉంటాడని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. అతడు అచ్చం దాదాలా ఉంటాడని చెప్పాడు. కోహ్లీలో ఆ ప్రత్యేకత ఉందని, తన పరిధి దాటి మరీ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడని చెప్పాడు. అందుకు రిషభ్‌పంత్‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. కాగా, ఇటీవల పంత్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అతడి విషయంలో కోహ్లీ ఎంతో అండగా నిలిచాడని, అవన్నీ ప్రెస్‌మీట్లలో కూడా చూశామని ఇర్ఫాన్‌ అన్నాడు. తాజాగా క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో పఠాన్‌ కోహ్లీ నాయకత్వం గురించి, యువ క్రికెటర్ల పాత్ర గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 

అండర్‌ 19 ప్రపంచకప్‌ తర్వాత ఎంతో మంది క్రికెటర్లు కనుమరుగయ్యారని, వాళ్లకి జాతీయ జట్టులో రాణించే సత్తా ఉన్నా అంతర్జాతీయ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారని మాజీ పేసర్‌ వెల్లడించాడు. అలాగే అండర్‌ 19 క్రికెటర్లు కొందరు టీమ్‌ఇండియాకు కూడా ఆడతారన్నాడు. ఆ రెండింటి మధ్య ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఉంటుందని, అక్కడే ఆటలో మరింత మెరుగవ్వడమే కాకుండా పెద్ద పోటీల్లో ఆడే శక్తిసామర్థ్యాలు సాధించాలని సూచించాడు. అండర్‌ 19, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఉన్న కాంపిటిషన్‌ లెవెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండదని ఇర్ఫాన్‌ చెప్పుకొచ్చాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకుంటూ మానసిక పరిపక్వతను కూడా సాధించాలాని పఠాన్‌ సూచించాడు. అదే అన్నిటికన్నా ముఖ్యమని చెప్పాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని