close

తాజా వార్తలు

రంజీల్లో ఝూర్ఖండ్‌ చారిత్రక విజయం

అగర్తలా: దేశవాళీ ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్‌ చరిత్రాత్మక విజయం సాధించింది. ఫాలో ఆన్‌ ఆడి ప్రత్యర్థిని ఓడించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఝార్ఖండ్‌ 54 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ ఘనత సాధించింది. సారథి మిలింద్ (59), హర్మీత్‌ సింగ్‌ (56) అర్ధశతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన త్రిపుర మొదటి ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఝార్ఖండ్.. రాణా (4/42), అభిజిత్‌ (3/43) చెలరేగడంతో 136 పరుగులకే కుప్పకూలింది. దీంతో 153 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఆతిథ్య జట్టు ఝార్ఖండ్‌ను ఫాలోఆన్‌ ఆడించింది. 

ఫాలో ఆన్‌కు దిగిన ఝార్ఖండ్‌ అద్భుతంగా పుంజుకొని భారీస్కోరు సాధించింది. కెప్టెన్‌ సౌరభ్‌ తివారి (122*), ఇషాంక్‌ జగ్గీ (107*) అజేయ శతకాలతో కదం తొక్కారు. దీంతో 418/8 భారీ స్కోరు వద్ద ఝార్ఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం 256 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన త్రిపుర.. పర్యాటక జట్టు బౌలర్ల ధాటకి 211 పరుగులకే కుప్పకూలింది. ఆశిష్ కుమార్‌ (5/67) చెలరేగడంతో 49 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ మణిశంకర్‌ (103) గొప్పగా పోరాడాడటంతో ఓటమి అంతరం తగ్గింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.