close
Array ( ) 1

తాజా వార్తలు

కర్ణాటక రంజీ సెమీఫైనల్‌కు కేఎల్‌ రాహుల్‌

బెంగాల్‌తో తలపడనున్న కర్ణాటక బ్యాట్స్‌మన్‌

దిల్లీ: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ కర్ణాటక రంజీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఈనెల 29 నుంచి బెంగాల్‌తో జరిగే సెమీఫైనల్లో ఆడనున్నాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన రాహుల్‌కు.. కర్ణాటక జట్టు క్వార్టర్‌ ఫైనల్లో విశ్రాంతినిచ్చింది. కివీస్‌తో 5 టీ20ల సిరీస్‌లో 56 సగటుతో 224 పరుగులు చేసిన అతడు, మూడు వన్డేల సిరీస్‌లో 204 పరుగులు చేశాడు. గత పది ఇన్నింగ్స్‌ల్లో ఒక శతకంతో పాటు నాలుగు అర్ధ శతకాలు బాదాడు ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌. 

మరోవైపు కేఎల్‌ రాహుల్‌ కర్ణాటక జట్టుతో కలవడం ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌కు మరింత బలం చేకూర్చనుంది. ఇప్పటికే టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే ఆ జట్టులో కొనసాగుతున్నాడు. కివీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ అనంతరం.. పాండే, రాహుల్‌ స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో జమ్మూతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పాండేకి అవకాశమివ్వడంతో (37; 35) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 167 పరుగులతో విజయం సాధించింది. మరోవైపు సౌరాష్ట్ర, గుజరాత్‌ రాజ్‌కోట్‌ వేదికగా రెండో సెమీస్‌లో తలపడనున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.