close

తాజా వార్తలు

Published : 25/09/2020 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రిస్‌ గేల్ ఎంట్రీ అప్పుడేనట!

సరైన సమయంలో క్రీజులో అడుగుపెడతాడన్న కెప్టెన్‌ రాహుల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. గురువారం బెంగళూరును చిత్తుగా ఓడించిన రాహుల్‌ సేన మొదటి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో తృటిలో ఓటమిపాలైంది. దిల్లీతో మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 89 పరుగులతో చెలరేగిపోగా, బెంగళూరుతో పోరులో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ విశ్వరూపం చూపించాడు. కేవలం కేవలం 69 బంతుల్లోనే 132 పరుగులు సాధించాడు. ప్రస్తుతం పంజాబ్‌ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే టీమ్‌లో భాగస్వామి అయిన యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ను మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడించలేదు. కాగా ఆ విధ్వంసకారుడి ఆట చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైదానంలో గేల్‌ ఎంట్రీ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. 

గురువారం బెంగళూరుతో పోరుకు ముందు సారథి రాహుల్‌ను ఇదే ప్రశ్న అడగ్గా అతడు ఆసక్తికరంగా స్పందించాడు. విండీస్‌ దిగ్గజం సరైన సమయంలోనే వస్తాడంటూ బదులిచ్చాడు. ‘క్రిస్‌గేల్ ఎంట్రీపై ఎలాంటి చింత వద్దు. అతడు సరైన సమయంలో క్రీజులో అడుగుపెడతాడు. గేల్‌ ఆటను చూసేందుకు మేము కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నాం. త్వరలోనే అతడు మైదానంలో అడుగుపెడతాడు’ అంటూ ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.