
తాజా వార్తలు
విలియమ్సన్ 251.. కివీస్ 519/7
హామిల్టన్: వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ్సన్(251; 412 బంతుల్లో 34x4, 2x6) ద్విశతకం సాధించాడు. అతడికి లాథమ్(86; 184 బంతుల్లో 12x4, 1x6), జేమీసన్(51; 64 బంతుల్లో 5x4, 2x6), రాస్‌టేలర్(38; 68 బంతుల్లో 6x4) తోడవ్వడంతో కివీస్ 519/7 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ప్రస్తుతం వికెట్ కోల్పోకుండా 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్లు బ్రాత్‌వైట్(20), జాన్ కాంప్‌బెల్(22) క్రీజులో ఉన్నారు. గురువారం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 14 పరుగుల వద్ద ఓపెనర్ విల్ యంగ్(5) ఔటయ్యాడు. గాబ్రియల్ ఎల్బీడబ్యూ చేయడంతో విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. అనంతరం అతడు చెలరేగడంతో పాటు మిగతా బ్యాట్స్‌మెన్ సహకరించారు. దీంతో ఆ జట్టు 500 పైచిలుకు స్కోర్ సాధించింది.