close
Array ( ) 1

తాజా వార్తలు

గ్రేట్‌: కోహ్లీ హృదయానికి దగ్గరైన సందర్భం అదే

ముంబయి: అరంగేట్రం మొదలు విరాట్‌ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో బద్దలు చేయని రికార్డుల్లేవు. సృష్టించని ఘనతల్లేవు. ఒక వైపు శతకాల వేట సాగిస్తున్నాడు. మరో వైపు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కెరీర్‌లో ఎన్నో సాధించినప్పటికీ తొలిసారి టీమిండియాకు ఎంపికైన రోజే తనకెంతో ఇష్టమని విరాట్‌ వెల్లడించాడు. ‘ఆడి’ ఆవిష్కరణ కార్యక్రమంలో అతడు మాట్లాడాడు.


ఏం చేయాలో తెలియలేదు

‘నేను భారత జట్టుకు ఎంపికైన రోజే నాకెంతో ప్రత్యేకం. నాకెంతో ప్రియం. నేనప్పుడు అమ్మతో కలిసి వార్తలు చూస్తున్నాను. నాకెవ్వరి నుంచి సమాచారం లేదు. అకస్మాత్తుగా టీవీలో నా పేరు ప్రత్యక్షం కావడంతో ఏం చేయాలో తోచలేదు. నన్ను నేను నియంత్రించుకోలేకపోయా. కూర్చోవాలో, నిలబడలో, పరుగెత్తాలో, ఎగిరి దూకాలో తెలియలేదు. ఆ ఒక్క సందర్భాన్ని నేను రోజుకు ఎనిమిది సార్లు హెచ్చవేస్తాను. గుర్తు తెచ్చుకుంటాను’ అని కోహ్లీ అన్నాడు.


ఆ అనుభూతి పునఃసృష్టి చేయలేం

2009 అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు విరాట్‌ సారథ్యం వహించాడు. అద్భుతమైన బ్యాటింగ్‌, నాయకత్వంతో జట్టును విజేతగా నిలిపాడు. అతడిలోని ప్రతిభను గమనించిన సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ‘జాతీయ జట్టు తరఫున టోర్నీలు, సిరీసులు ఆడినప్పుడు గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు నుంచి ఘనతలు వస్తాయి. కానీ ఎనిమిదేళ్ల కుర్రాడు క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టి దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఎంతో కష్టపడక తప్పదు. ఆ అనుభూతిని ఎప్పటికీ పునఃసృష్టి చేయలేం. ఆరంభమే నన్ను నిలబెట్టింది. అది స్పష్టత, దార్శనికత, ప్రేరణనిచ్చింది. నేనెక్కడి నుంచి వచ్చానో గుర్తుచేస్తూ నన్ను నేలపైనే ఉంచుతోంది’ అని విరాట్‌ తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.