close
Array ( ) 1

తాజా వార్తలు

కోహ్లీని ఎలా ఔట్‌ చేశానంటే: జేమీసన్‌

హామిల్టన్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా క్రీజులో నిలిస్తే మైదానంలో పరుగుల వరద ఎలా పారుతుందో అందరికీ తెలుసు. అలాంటిది అరంగేట్రం టెస్టులోనే వీరిద్దరినీ పెవిలియన్‌ పంపించి సంచలనం సృష్టించాడు కివీస్‌ యువపేసర్‌ జేమీసన్‌. మిడిలార్డర్‌లో ప్రధానమైన హనుమ విహారినీ ఔట్‌ చేశాడు. తొలిటెస్టు తొలి రోజు మూడు వికెట్లు తీసి భారత్‌ను 122/5కు పరిమితం చేశాడు. నెల రోజులుగా ఏం జరుగుతుందో నమ్మశక్యం కాకుండా ఉందని జేమీసన్‌ అంటున్నాడు. కోహ్లీని ఔట్‌ చేసేందుకు అతడి బలహీనతలు వెతకలేదని పేర్కొన్నాడు.

‘నిజంగా నమ్మశక్యం కావడం లేదు. రెండు వారాలుగా ఏం జరుగుతుందో అర్థమవ్వడం లేదు. మ్యాచును చూసుకుంటే మేమిప్పుడు మంచి స్థితిలో ఉన్నాం. విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో అతడు కీలకం. విరాట్‌ త్వరగా ఔటవ్వడం మాకు కీలకం. ఇద్దరు ఆటగాళ్లను తొలి సెషన్‌లోనే పెవిలియన్‌కు పంపించడం నాకు ప్రత్యేకం. కోహ్లీని ఔట్‌ చేసేందుకు అతడి బలహీనతల గురించి వెతకడం తెలివైన పనికాదు. ఎందుకంటే అతడు అన్ని దేశాల్లోనూ పరుగులు చేస్తున్నాడు. స్టంప్‌కు విసిరితే అతడు బాగా ఆడతాడు. అందుకే పిచ్‌ సహకారంతో స్టంప్‌లైన్‌కు కొద్దిగా పక్కకు విసిరాను. అదృష్టవశాత్తూ బంతి అతడి బ్యాట్‌ అంచుకు తగిలి దొరికిపోయాడు’ అని జేమీసన్‌ అన్నాడు.

అత్యంత నిలకడకు మారుపేరైన కోహ్లీ గత 19 ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదలేదు. కివీస్‌ బౌలర్లు అతడికి కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు చేయలేకపోయాడు. అతడి కెరీర్‌లో మళ్లీ 2014 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
VITEEE 2020
Saket Pranamam
besttaxfiler
dr madhu
HITS2020

Panch Pataka

దేవతార్చన