close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/08/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాదాడు..!’

సుబ్రమణ్యం బద్రీనాథ్‌ గురించి లక్ష్మీపతి బాలాజీ

ఇంటర్నె్ట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్‌ ఒక మ్యాచ్‌లో అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాది జట్టును ఆదుకున్నాడని మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ చెప్పాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ నిర్వహించే ‘ఫార్ములా ఫర్‌ సక్సెస్‌’ అనే యూట్యూబ్‌ షోలో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా అశ్విన్‌.. బద్రీతో పాటు బాలాజీని పలు విషయాలను అడిగాడు. అప్పుడే బద్రీనాథ్‌ బ్యాటింగ్‌ గురించి అడగ్గా బాలాజీ స్పందించాడు. రంజీ క్రికెట్‌ ఆడే రోజుల నుంచే తనకు బద్రీ తెలుసని చెప్పాడు. అందరూ అతడు నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తాడని అంటారని, కానీ అతడిలో మరో కోణం కూడా ఉందన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు తనని తాను మలుచుకుంటాడని వివరించాడు.

బద్రీ కాలేజ్‌ డేస్‌ నుంచే అలా నెమ్మదిగానే ఆడేవాడని, అయితే.. అంత తేలిగ్గా వికెట్‌ ఇవ్వడని బాలాజీ చెప్పాడు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లోనే ఒక సెషన్‌లో శతకం ఎలా బాదగలడో చూపించాడన్నాడు. మ్యాచ్‌కు ముందే మరో గంటలో శతకం బాదుతానని తనతో చెప్పినట్లు బాలాజీ గుర్తుచేసుకున్నాడు. దాంతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఒకసారి మహారాష్ట్రలో ఆడేటప్పుడు అతడు డీహైడ్రేషన్‌కు గురైతే ఆస్పత్రికి వెళ్లాడని, తర్వాత తమిళనాడు వికెట్లు కోల్పోయినప్పుడు అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాదాడని, దాంతో తమ జట్టును కాపాడాడని గుర్తుచేశాడు. బద్రీ గురించి ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియవని, అతడు చాలా చేయగలడని బాలాజీ పేర్కొన్నాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.