‘మైండ్‌ గేమ్‌’ ఆడితే ఆడనివ్వండి: రహానె

తాజా వార్తలు

Published : 26/12/2020 02:21 IST

‘మైండ్‌ గేమ్‌’ ఆడితే ఆడనివ్వండి: రహానె

మెల్‌బోర్న్‌: ఆసీస్‌ క్రికెటర్ల ‘మైండ్‌ గేమ్‌’ గురించి తాము ఆందోళన చెందడం లేదని టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె అన్నాడు. జట్టు కూర్పు, ప్రణాళికలపై ఎక్కువ దృష్టిసారించామని తెలిపాడు. స్వదేశానికి వెళ్లేముందు విరాట్‌ కోహ్లీ జట్టు సభ్యులతో కాసేపు మాట్లాడి స్ఫూర్తి నింపాడని పేర్కొన్నాడు. బాక్సింగ్‌ డే టెస్టుకు ముందు జింక్స్‌ మాట్లాడాడు. తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోవడం టీమ్‌ఇండియా, సారథి రహానెపై ఒత్తిడి పెంచుతుందని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్న సంగతి తెలిసిందే.

‘‘ఆస్ట్రేలియా వాళ్లు చాలా బాగా మైండ్‌గేమ్‌లు ఆడతారు. వాళ్లు అలాగే ఆడనివ్వండి. మేమైతే మా జట్టుపై దృష్టిపెట్టాం. ఒక బృందంగా మమ్మల్ని మేం ప్రోత్సహించుకోవాల్సిన సమయమిది. టీమ్‌ఇండియాను ముందుకు నడిపించడం నేను గర్వపడే విషయం. ఇదొక గొప్ప అవకాశం. గొప్ప బాధ్యత. అయితే నేనెలాంటి ఒత్తిడికి గురవ్వదల్చుకోలేదు. నేను చేయాల్సింది నా జట్టుకు అండగా ఉండడం. విరాట్‌ వెళ్లేముందు మాతో మాట్లాడాడు. అడిలైడ్‌లో జట్టంతా కలిసి డిన్నర్‌ చేశాం. పరిస్థితులను బట్టి ఆడాలని, ఒకర్నొకరు ప్రోత్సహించుకుంటూ సమయం ఆస్వాదించాలని సూచించాడు. అప్పుడే విజయం లభిస్తుందని మాకు చెప్పాడు’ అని రహానె వివరించాడు.

‘అడిలైడ్‌లో తొలి రెండు రోజులు మేం బాగా ఆడాం. మూడో రోజు ఒక్క గంటలోనే అంతా పోగొట్టుకున్నాం. మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌కు స్వేచ్ఛను ఇస్తున్నాం. ఆసీస్‌లోనే కాదు ఎక్కడైనా ఓపెనింగ్‌ కష్టమే. ఓపెనర్లు కుదురుగా ఆడి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పితే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌కు సులభమవుతుంది. జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌ మా పేసర్లు. సిరాజ్‌ సైతం మిగతా వాళ్లతో సమానమైన ప్రతిభావంతుడు. ఇక ఎంసీజీ విషయానికి వస్తే మైదానంలో కాలక్రమేణా మార్పులు వస్తున్నాయి. 2018లో పిచ్‌ కాస్త భిన్నంగా ఉంది. 2014లో ఇది మంచి వికెట్‌. వికెట్‌ను త్వరగా అర్థం చేసుకొని మేం ఆడాల్సి ఉంటుంది’ అని రహానె అన్నాడు.

ఇవీ చదవండి
కోహ్లీకి క్షమాపణలు చెప్పా: రహానె
టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని