close

తాజా వార్తలు

Published : 14/08/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీకి కరోనా నెగెటివ్‌

దిల్లీ: టీమ్‌ ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోనీ కొవిడ్‌ -19 పరీక్ష ఫలితం వచ్చింది. ఆయనకు నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యులు వెల్లడించారు. రాంచీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఈ రోజు ఉదయం ధోనీ ఫాంహౌస్‌కు వచ్చి స్వాబ్‌ సేకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో ధోనీ చెన్నైలోని శిక్షణా శిబిరానికి శుక్రవారం పయనం కానున్నాడు.  ఆగస్టు 15 నుంచి 20 మధ్య సీఎస్‌కే ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ క్యాంపు జరగనుంది. అక్కడి నుంచే ఈ నెల 21న ఐపీఎల్‌ ఆడేందుకు యూఏఈకి వెళ్లనున్నాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.