close

తాజా వార్తలు

Published : 29/10/2020 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ ట్వీట్‌ చూసి సూర్య సంతోషిస్తాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను శతకం బాదిన సిరీస్‌లో టీమ్‌ ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి ఉండాల్సిందని వెటరన్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారి ఆశాభావం వ్యక్తం చేశాడు. గతరాత్రి బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(79*) కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంతోనే ఇలా కసిగా ఆడాడని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి గతరాత్రి సూర్యకుమార్‌ను ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. అతడిని పొగుడుతూ సహనంతో ఉండాలని చెప్పాడు. అయితే, ఈ సందేశం సూర్యకుమార్‌ను సంతోష పెడుతుందని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు.

‘నేను శతకం బాదిన సిరీస్‌లో మీరు టీమ్‌ఇండియా కోచ్‌గా ఉండాల్సి ఉంది. మీ నుంచి ఇలాంటి సందేశం వస్తే కచ్చితంగా నా అంతర్జాతీయ కెరీర్‌కు దోహదపడేది. మీ నుంచి ఈ ట్వీట్‌ రావడం చూసి సూర్య సంతోషిస్తాడు’ అని తివారి రీట్వీట్‌ చేశాడు. కాగా, 2008 నుంచి 2015 వరకు అడపాదడపా అవకాశాలొచ్చిన తివారి మొత్తం 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. ఇక 2011 విండీస్‌ భారత పర్యటన సందర్భంగా ఐదో వన్డేలో శతకంతో మెరిశాడు. ఈ సిరీస్‌ను ఉద్దేశించే తివారి పైవిధంగా పేర్కొన్నాడు. తర్వాత ఈ వెటరన్‌ క్రికెటర్‌ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోవడంతో దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో ముంబయి అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 8 గెలిచిన ఆ జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ చేరుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ రాణించి ఐదోసారి టైటిల్‌ ఎగరేసుకుపోవాలని చూస్తోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.