ఆసీస్‌ ఓపెనర్లు ఖరారైనట్లేనా?

తాజా వార్తలు

Published : 12/12/2020 22:21 IST

ఆసీస్‌ ఓపెనర్లు ఖరారైనట్లేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: డేవిడ్ వార్నర్‌, విల్‌ పకోస్కీ తొలి టెస్టుకు దూరమవ్వడంతో ఆస్ట్రేలియా ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారని ఆసక్తి మొదలైంది. జో బర్న్స్‌ జట్టులో ఉన్నప్పటికీ అతడు నిలకడగా పరుగులు సాధించట్లేదు. అయితే పకోస్కీ స్థానంలో మార్కస్‌ హారిస్‌ను భారత్‌తో జరిగే తొలి టెస్టుకు ఎంపిక చేస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తెలిపింది. ‘‘సన్నాహక మ్యాచ్‌ల్లో భారత బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం హారిస్‌కు ఉంది. అంతేగాక విక్టోరియా తరఫున అతడు సత్తాచాటాడు. అయితే వార్నర్‌, విల్ తొలి టెస్టుకు దూరమవ్వడం నిరాశకు గురిచేసింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో వీరిద్దరు తిరిగి జట్టులోకి వస్తారని ఆశిస్తున్నాం’’ సెలక్టర్‌ ట్రెవర్‌ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి టెస్టు సిరీస్‌లో వార్నర్‌-పకోస్కీ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారని మాజీ ఆసీస్‌ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే గాయాలతో వారిద్దరు తొలి టెస్టుకు దూరం కావడంతో బర్న్స్‌-హారిస్‌కు ఓపెనర్లుగా తుదిజట్టులో అవకాశాలు వస్తాయని భావిస్తున్నారంతా. మరోవైపు కీలక ఆటగాడు లబుషేన్.. తనకి అవకాశం ఇస్తే ఓపెనర్‌గానూ సత్తాచాటుతానని పేర్కొన్నాడు. దీంతో ఓపెనర్లు ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. వార్నర్ గైర్హాజరీతో మూడో వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన లబుషేన్‌ (7) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని