close

తాజా వార్తలు

టెస్టు క్రికెట్‌లో కొత్త రూల్‌ చెప్పిన మైఖేల్‌ వాన్‌

ఎవరైనా గాయపడితే ఇంకొకర్ని ఆడించాలి

పెర్త్‌: టెస్టు క్రికెట్‌లో ఎవరైనా ఆటగాడు గాయపడితే సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ని కొనసాగించాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు(డేనైట్‌)లో న్యూజిలాండ్‌ బౌలర్‌ లాకీ ఫెర్గుసన్‌ కుడికాలి కండరం పట్టేయడంతో గురువారం మైదానాన్ని వీడాడు. అతడికి వైద్య పరీక్షలు చేయించగా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి వీలుకాదని తెలిసింది. ఈ ఘటనను ఉద్దేశించి వాన్‌ ట్వీట్‌ చేస్తూ టెస్టు క్రికెట్‌లో కొత్త నిబంధనను తీసుకురావాలని అన్నాడు. సంప్రదాయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో మరొకర్ని(సబ్‌స్టిట్యూట్‌) తీసుకోవాలని సూచించాడు. ఈ విషయంపై క్రికెట్‌ పాలకులు దృష్టి సారించాలని కోరాడు. 

‘టెస్టు క్రికెట్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో వేరొకర్ని కొనసాగించే కొత్త నిబంధనని ప్రవేశపెట్టాలని బలంగా చెబుతున్నా. మైదానంలో ఒక స్వతంత్ర వైద్యుడు ఉండి, ఎవరైనా ఆటగాడు గాయపడితే.. అతని పరిస్థితిని తెలుసుకొని నిజమైన గాయమే అని తేలిస్తే.. సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ని ఆడించాలి. ఈ విషయంలో మీరంతా ఏమంటారు?’ అని ట్వీట్‌ చేశాడు. అనంతరం ఓ క్రీడా వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఇంగ్లాండ్‌ మాజీ సారథి టెస్టు క్రికెట్‌కు ఏది అవసరమో దాన్ని పర్యవేక్షించాలన్నాడు. ‘ఒకవేళ ఏ ఆటగాడి తలకైనా గాయమైతే.. (లార్డ్స్‌లో స్మిత్‌కు జరిగినట్టు) అతడికి బదులు కంకషన్‌ ప్లేయర్‌గా మార్నస్‌ లబుషేన్‌ బరిలోకి దిగాడు. అప్పటి నుంచి ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఎలా ఆడుతున్నాడో మీకు తెలుసు. అతను బాగా ఆడుతున్నాడని నేనీ విషయాన్ని ప్రస్తావించట్లేదు. కానీ, ఇలా కూడా ఎందుకు ఆలోచించకూడదని అడుగుతున్నా. ఇరు జట్లు 11 మందితో ఆడాలి. కానీ ఇప్పుడు న్యూజిలాండ్‌ 10 ఆటగాళ్లతో, ఆసీస్‌ 11 మందితో ఆడుతోంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. ఒక బ్యాట్స్‌మన్‌ తొలి బంతికే చేయి విరిగితే, తప్పకుండా మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని అంటున్నా. అది కూడా మైదానంలోని వైద్యుడు అది నిజమైన గాయమని నిర్ధారిస్తేనే’ అని తన అభిప్రాయాన్ని వివరించాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.