11 ఏళ్లైనా జడ్డూను చిన్నచూపు చూస్తున్నారు

తాజా వార్తలు

Published : 05/12/2020 15:37 IST

11 ఏళ్లైనా జడ్డూను చిన్నచూపు చూస్తున్నారు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 11 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అతడిని చిన్నచూపు చూస్తున్నారని, తనకు దక్కాల్సిన గుర్తింపు లభించడం లేదని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాపై గత రెండు మ్యాచ్‌ల్లో జడ్డూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో జడేజా(66*), హార్దిక్‌ పాండ్య(92*)తో కలిసి 150 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పగా, శుక్రవారం జరిగిన తొలి టీ20లో మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో 23 బంతుల్లో 44 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చివరి ఓవర్‌లో అతడి తలకు గాయమవడంతో మిగిలిన టీ20లకు ఆడడం లేదని టీమ్‌ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కైఫ్‌ స్పందిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు.

‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు అతడెంత విలువైన ఆటగాడో రెండు మ్యాచ్‌ల్లో నిరూపించుకున్నాడు. తన ఆటతో జట్టుకు సమతూకం తీసుకొచ్చాడు. 11 ఏళ్లుగా ఆడుతున్నా ఇంకా జడేజాను చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పుడు లభిస్తున్న గౌరవం కన్నా ఇంకా ఎక్కువే దక్కాల్సి ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా అతడి సేవల్ని కోల్పోనుందని అనిపిస్తోంది’ అంటూ కైఫ్‌ పేర్కొన్నాడు. కాగా, జడేజా కొద్ది కాలంగా లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అతడు మంచి ఫీల్డర్‌గా, పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా సేవలందిస్తూనే జట్టు క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్‌ చేసి ఆదుకుంటున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనూ మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ(50)తో కలిసి 77 పరుగులు సాధించి జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆఖర్లో ఇద్దరూ ఔటవ్వడంతో భారత్‌ కివీస్‌ చేతిలో ఓటమిపాలైంది. తర్వాత కూడా జడేజా పలుమార్లు తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు.

ఇవీ చదవండి..

జడేజా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌పై రచ్చ? 

నాటి ఆసీస్‌ లాభం.. కోహ్లీసేనతో నష్టమైందా?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని