close

తాజా వార్తలు

అజహరుద్దీన్‌ చీటింగ్‌ కేసుపై వివరణ

ట్విటర్‌లో వీడియో విడుదల చేసిన మాజీ కెప్టెన్‌

ఔరంగాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ను మోసం చేశారనే ఆరోపణలపై అజహరుద్దీన్‌తో సహా మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఔరంగాబాద్‌కు చెందిన షాహబ్‌ మొహమ్మద్‌ అనే ట్రావెల్‌ ఏజెంట్‌.. మజీబ్‌ఖాన్‌, సుధీష్‌ అవిక్కల్‌, మహమ్మద్‌ అజహరుద్దీన్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఫిర్యాదుదారుడు కథనం ప్రకారం.. 2019 నవంబర్‌ 9 నుంచి నవంబర్‌ 12 వరకు సుధీష్‌ అవిక్కల్‌ అనే వ్యక్తి తనతో వివిధ అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్‌ చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముంబయి-దుబాయ్‌-పారిస్‌, పారిస్‌- ట్యూరిన్‌, ట్యూరిన్‌-పారిస్‌, ట్యూరిన్‌-ఆమ్‌స్టర్‌డామ్‌, ట్యూరిన్‌-మునిచ్‌-ఆమ్‌స్టర్‌డామ్‌ ఇలా అనేక టికెట్లు తీసుకున్నారని, అందులో అజహరుద్దీన్‌, అవిక్కల్‌ ప్రయాణించారని వెల్లడించాడు. ఈ సమయంలో డబ్బులు లేవని, అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అవిక్కల్‌ తనతో చెప్పడంతో, మరోపక్క అజహరుద్దీన్‌ వ్యక్తిగత సిబ్బంది హామీ ఇవ్వడంతో తాను చెల్లించానని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అవిక్కల్‌ నవంబర్‌ 12న తన బ్యాంక్‌ నుంచి డబ్బు జమ చేస్తున్నట్లు చెప్పినా నవంబర్‌ 15వరకు తన అవి జమకాలేదని ఫిర్యాదుదారుడు తెలిపారు. 

రూ.20లక్షలకు పైగా విమాన టికెట్లకు తాను చెల్లించానని.. ఈ విషయంపై అజహరుద్దీన్‌, ముజీబ్‌ఖాన్‌లను సంప్రదించినా వాళ్లిద్దరూ తనని పట్టించుకోలేదని చెప్పారు. ఈ క్రమంలో నవంబర్‌ 24న అవిక్కల్‌ తన ట్రావెల్‌ ఏజెన్సీ పేరిట మొత్తం రూ.21,45,000 చెల్లిస్తున్నట్లు ఒక చెక్‌ ఫొటోను తన వాట్సాప్‌కు పంపించాడని.. కానీ, ఇప్పటి వరకు తనకు డబ్బు అందలేదని ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా అజహరుద్దీన్‌ గతరాత్రి ఈ ఫిర్యాదుపై స్పందించాడు. తన ట్విటర్‌లో ఒక వీడియో పోస్టు చేస్తూ.. అందులో తానేమీ మోసం చేయలేదని, ఇదంతా తప్పుడు ఆరోపణలని చెప్పాడు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ పట్ల తన న్యాయవాదులతో సంప్రదిస్తున్నట్లు మాజీ కెప్టెన్‌ వివరణ ఇచ్చాడు. 

ఇవీ చదవండి:

కోహ్లీని ఎవరూ ఆపలేరు: స్టీవ్‌స్మిత్‌

కోహ్లీ ముంగిట.. ఆ రెండు రికార్డులు



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.