close

తాజా వార్తలు

Updated : 30/10/2020 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూర్యకుమార్‌పై ముంబయి ట్వీట్‌.. వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌లో ఇప్పుడంతా సూర్యకుమార్‌ యాదవ్‌ గురించే చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగే సుదీర్ఘ సిరీస్‌కు వెళ్లే భారత జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఇది మనసులో పెట్టుకున్నాడో ఏమో గత మ్యాచ్‌లో కసిగా బ్యాటింగ్‌ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి.. తానూ మంచి ఆటగాడేనని.. ఉత్తమ ఇన్నింగ్స్‌ ఆడగలనని నిరూపించాడు. అయితే.. ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ముంబయి ఛేదనలో బెంగళూరుకు కొరకరాని కొయ్యలా మారిన సూర్యకుమార్‌ దగ్గరకు వెళ్లిన విరాట్‌ కోహ్లీ తన అసహనం వ్యక్తం చేశాడు. ‘అవుటైపోతావు జాగ్రత్త’ అన్నట్లుగా ఏవో వ్యాఖ్యలు చేశాడు. దానికి సూర్యకుమార్‌ స్పందించకుండా తనకేం పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే.. సూర్యకుమార్‌ దగ్గరకు కోహ్లీ వచ్చిన ఫొటోను ముంబయి యాజమాన్యం ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘అతను వచ్చాడు. అతను దృష్టి పెట్టాడు. అతను సాధించాడు’ అని ఆ పోస్టులో పేర్కొంది.  ఆ ట్వీట్‌ కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై క్రికెట్‌ అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

టాస్‌ గెలిచిన ముంబయి మొదట బ్యాటింగ్‌కు బెంగళూరును ఆహ్వానించింది. ప్రారంభంలో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ ధాటిగా ఆడినప్పటికీ తర్వాత ముంబయి బౌలర్లు కట్టడి చేశాడు. దీంతో ముంబయి ముందు 165 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన నిర్దేశించింది. ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 43 బంతుల్లో 79 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

ఇవీ చదవండి..

పంత్‌.. ఇక నిద్ర చాలు! 

ఉత్కంఠ పోరులో చెన్నై విజయం
 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.