close
Array ( ) 1

తాజా వార్తలు

ప్రపంచకప్‌ గెలుపునకు నేను ఉపయోగపడతా

ముంబయి: తన ఆత్మవిశ్వాసం, అభిరుచి, సానుకూలత టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలిచేందుకు ఉపయోగపడతాయని యువ పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అంటున్నాడు. గతంలో చేసిన తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నానని వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీసులో అతడు ధారాళంగా పరుగులిచ్చిన సంగతి తెలిసిందే.

‘నా దృష్టంతా టీ20 ప్రపంచకప్‌పై ఉంది. నాకున్న ఆత్మవిశ్వాసం, సానుకూలత, అభిరుచితో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలిచేందుకు సాయపడగలను. ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లే ముందు జోరందుకొనేందుకు ఐపీఎల్‌ కచ్చితంగా కీలకం. త్వరలో శ్రీలంకతో టీ20లు ఉన్నాయి. ఐపీఎల్‌ తర్వాత జింబాబ్వేకు వెళ్తున్నాం. నా పొరపాట్లను అధ్యయనం చేస్తాను. నేర్చుకొనేందుకు అవి ఉపయోగపడతాయని నా నమ్మకం. న్యూజిలాండ్‌కు వెళ్లడం నాకిదే తొలిసారి. ఇతరులతో పోలిస్తే అక్కడ నా అనుభవం తక్కువ. మున్ముందు జట్టు కోసం ఉపయోగపడతాను’ అని శార్దూల్‌ అన్నాడు.

‘ఎక్కువ పరుగులు ఇస్తే ఫర్వాలేదు. ప్రతిసారీ అద్భుతంగా వేయలేం కదా. ఒక ఓవర్లో 20 పరుగులు ఇస్తే ఆ తర్వాత 16, 14 లేదా 15 చివర్లో ఇంకా తక్కువ పరుగులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. మేం ఆఖరి ఓవర్లలోనూ పరుగులను కాపాడుకోగలుగుతున్నాం. అదే తొలుత బౌలింగ్‌ చేస్తే పరుగులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను బ్యాటింగ్‌ చేయగలనని ఎప్పుడూ నమ్ముతాను. ఆ పరుగులు జట్టుకు కచ్చితంగా సాయపడతాయి. పాఠశాల, విశ్వవిద్యాలయం జట్లకు ఆడేటప్పుడూ పరుగులు చేసేవాడిని. అంతర్జాతీయ మ్యాచులు ఆడినా నా పాత్ర అలాగే ఉంటుంది. 9/8/7, బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏదైనా పరిస్థితికి తగినట్టు పరుగులు చేస్తాను’ అని శార్దూల్‌ అన్నాడు. ఐపీఎల్‌లో అతడు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడనున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
Saket Pranamam
VITEEE 2020
dr madhu
besttaxfiler
HITS2020

Panch Pataka

దేవతార్చన