ఎవరీ ‘సూపర్‌ ఓవర్‌’ బ్యూటీ..?
close

తాజా వార్తలు

Updated : 21/10/2020 15:06 IST

ఎవరీ ‘సూపర్‌ ఓవర్‌’ బ్యూటీ..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఆదివారం టీ20 లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను అందించింది. ముంబయి, పంజాబ్‌ మధ్య జరిగిన ఈ పోరులో విజేతను నిర్ణయించేందుకు ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు పంజాబ్‌ గెలిచింది. అయితే.. పంజాబ్‌ లక్ష్య ఛేదన చివరి ఓవర్‌లో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేడియంలో మ్యాచ్‌ చూస్తూ టెన్షన్‌తో గోళ్లు కొరుకుతున్న ఆమె ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. మ్యాచ్‌ ఉత్కంఠ సాగుతున్న సమయంలో టీవీ స్క్రీన్‌పై ఒక్కసారిగా తళుక్కుమన్న ఆ సుందరి ఎవరా..? అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆమె ఆచూకీ ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికింది. ఆమె పేరు రియానా లాల్వాణి. ఆమె ఎవరు.. ఎక్కడుంటుంది..? అనే వివరాలు తెలియలేదు.

కోవిడ్‌19 కారణంగా మైదానంలో బయోబబుల్‌ నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూస్తోంది అంటే.. ఆమె రెండు ఫ్రాంచైజీల్లో ఏదో ఒక జట్టుకు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సోషల్‌ మీడియాలో ఆమెకు ఒక్కసారిగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకూ కేవలం 11 పోస్టులు పెట్టిన ఆమెకు.. ఫాలోవర్స్ సంఖ్య 61,000 దాటింది. ఇదంతా చూసిన ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రొఫైల్‌లో ‘దుబాయ్‌.. దట్‌ సూపర్‌ ఓవర్‌ గళ్’ అని రాసి ఉంచింది. అంతేకాదండోయ్‌ ‘రియానా ఫ్యాన్స్‌ క్లబ్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో పేజీలు కూడా పుట్టుకొచ్చాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని