close

తాజా వార్తలు

సూపర్‌ఓవర్‌ తెలియక బ్యాగుసర్దేసుకున్న రోహిత్‌

ఈ విజయం షమిదే అంటున్న హిట్‌మ్యాన్‌

హామిల్టన్‌: సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వస్తుందని తాను ఊహించలేదని టీమ్‌ఇండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. అందుకే తనకు సంబంధించిన వస్తువులన్నీ ముందే బ్యాగులో సర్దేసుకున్నానని పేర్కొన్నాడు. ఎంతో శ్రమించినా కివీస్‌కు విజయం దక్కకపోవడం వారికి నిరాశ కలిగించే ఉంటుందని తెలిపాడు. కోహ్లీసేన నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ సమం చేసింది. సూపర్‌ ఓవర్లో 17 పరుగులు చేసింది. విజయానికి భారత్‌ ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా రోహిత్‌ వరుస సిక్సర్లో చిరస్మరణీయ విజయం అందించాడు.


ఐదు నిమిషాలు పట్టింది

‘బ్యాగు మొత్తం సర్దేసుకున్నా. నా వస్తువులన్నీ అందులోనే ఉండిపోయాయి. ఎక్కడుందో తెలియకపోవడంతో అబ్‌డామిన్‌ గార్డ్‌ వెతికేందుకు ఐదు నిమిషాలు పట్టింది. కివీస్‌ బ్యాటింగ్‌ను చూస్తే సూపర్‌ ఓవర్‌ గురించి ఆలోచనే రాలేదు. వారు సులభంగా మ్యాచ్‌ గెలుస్తారని అనిపించింది. సూపర్‌ ఓవర్‌ పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయడంపై సాధనేమీ ఉండదు. అదే బౌలర్‌కైతే ఏ ఓవర్‌నైనా ఒకేలా ఉంటుంది. నేను 60 పరుగులు చేయకుంటే నా బదులు శ్రేయస్‌ లేదా మరొకరు వచ్చేవారు. సౌథీ సవాల్‌గా బౌలింగ్‌ చేశాడు. సాధారణంగా సూపర్‌ ఓవర్‌లో బౌలర్‌పై ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేశా. చివర్లో క్రీజులోనే ఉండాలా? ముందుకొచ్చి ఆడాలా? అన్న ఆలోచనలు వచ్చాయి. అతడు నా పరిధిలో బంతులు వేయడంతో చితకబాదాను’ అని రోహిత్‌ అన్నాడు.


జట్టుకు శుభసూచకం

ప్రపంచకప్‌ ముందు టీమ్‌ ఇండియా విజయాల బాటలో పయనిస్తుండటం శుభసూచకమని హిట్‌మ్యాన్‌ తెలిపాడు. కుర్రాళ్లంతా బాగా ఆడుతున్నారని ప్రశంసించాడు. ‘ఎవరికి అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నారు. లంకపై శిఖర్‌ కీలకమైన అర్ధశతకం బాదాడు. చివరి 7-8 టీ20ల్లో కేఎల్‌ నాలుగైదు అర్ధశతకాలు అందుకున్నాడు. జట్టుకు ఇది మంచిదే. జట్టులో ఎక్కువ మంది ఫామ్‌లో ఉండటం కీలకం. జట్టు కూర్పును నిర్ణయించేందుకు సారథి, యాజమాన్యానికి ఇది ఉపయోగపడుతుంది. మా విజయాల జోరును మేం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. షమి వేసిన ఆఖరి ఓవర్‌ ఎంతో కీలకం. నా సిక్సర్లు కాదు నిజానికి అతడి బౌలింగే విజయం అందించింది. మంచు కురుస్తున్నప్పుడు 9 పరుగుల్ని కాపాడటం కష్టం. కేన్‌ విలియమ్సన్‌ (95) అద్భుతంగా ఆడాడు. బహుశా వారి జట్టు నిరాశపడి ఉంటుంది. కానీ మేం పుంజుకున్నాం. ఆఖరి వరకు ఆశలు వదులుకోలేదు’ అని రోహిత్‌ చెప్పాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.