close

తాజా వార్తలు

Published : 02/08/2020 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ విషయంలో కోహ్లీ ఒక్కడే కాదు.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కన్నా ముందు టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ టూర్‌లో భారత్‌ కేవలం పొట్టి క్రికెట్‌లోనే మెరిసింది. ఇక వన్డేలు, టెస్టుల్లో చేతులెత్తేసింది. అయితే, ఈ పర్యటనలో మరో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పూర్తిగా విఫలమవ్వడం. ఒక్క టీ20 మినహా ఏ మ్యా‌చ్‌లోనూ అతడు రాణించలేదు. మరోవైపు సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌ సైతం జట్టుకు దూరమయ్యారు. అలా భారత్‌ అటు వన్డేల్లో ఇటు టెస్టుల్లో విఫలమైంది. ఈ విషయాలపై స్పందించిన న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో కివీస్‌ గడ్డపై ఆడడానికి టీమ్‌ఇండియానే సరైన జట్టని పేర్కొన్నాడు. 

తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన అతడు భారత్‌ నిలకడగా ఆడిందని, ఏమాత్రం అతిగా ప్రవర్తించలేదని చెప్పాడు. అయితే, అక్కడి పరిస్థితులే వారికి సవాలుగా మారాయని అన్నాడు. విదేశీ జట్లకు అక్కడి పిచ్‌లు కష్టంగా ఉంటాయని, వాటిని అర్థం చేసుకోవాలని మైక్‌ సూచించాడు. ఇక కోహ్లీ బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. అతనొక్కడే న్యూజిలాండ్‌లో విఫలంకాలేదని స్పష్టంచేశాడు. టీమ్‌ఇండియా సారథి కోసం కివీస్‌ బౌలర్లు అత్యుత్తమ ప్రణాళికలు రూపొందించారని, తద్వారా అతడిని కట్టడి చేశారని మెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా అక్కడి నుంచి స్వదేశానికి వచ్చాక దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉంది. కరోనా వైరస్‌ కారణంగా అది ప్రస్తుతానికి వాయిదా పడింది. ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అనంతరం లాక్‌డౌన్‌ విధించడంతో అప్పుడే నిర్వహించాల్సిన ఐపీఎల్‌ కూడా వాయిదా పడింది. ఇప్పుడు దాన్ని సెప్టెంబర్‌లో యూఏలో నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని