close
Array ( ) 1

తాజా వార్తలు

కోహ్లీసేన తిరిగొచ్చే లోపే కొత్త సెలక్టర్లు!

ముంబయి: మార్చి తొలి వారంలోనే జాతీయ సెలక్షన్‌ కమిటీలో ఇద్దరు కొత్త సెలక్టర్ల ఎంపిక జరుగుతుందని క్రికెట్ పాలక మండలి (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ తెలిపాడు. ‘‘సెలక్టర్ల పదవికి దరఖాస్తు చేసిన వారిలో షార్ట్‌లిస్ట్‌ను తయారుచేస్తాం. ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌తో కలిసి చర్చించి ఇంటర్వ్యూలకు అర్హత సాధించే వారి జాబితాను సిద్ధం చేస్తాం. మార్చి 1 లేదా 2వ తేదీలోపు కొత్త సెలక్టర్ల నియామకం పూర్తిచేస్తాం. న్యూజిలాండ్‌ పర్యటన ముగించి టీమ్‌ఇండియా స్వదేశానికి తిరిగి వచ్చేలోపే ఈ ప్రక్రియ ముగుస్తుంది. కొత్తగా నియామకమైన సెలక్టర్లే మార్చి 12న ఆరంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు’’ అని తెలిపాడు.
ఇటీవల భారత మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, మదన్‌ లాల్‌, సులక్షణ నాయక్‌ సీఏసీ సభ్యులుగా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. జాతీయ సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యత వీరిదే. పదవీ కాలం ముగిసిన చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, సెలక్టర్‌ గగన్ ఖోడా స్థానాలను వీరు భర్తీ చేస్తారు. మాజీ క్రికెటర్లు అజిత్‌ అగార్కర్‌, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రాజేశ్‌ చౌహాన్‌, నయన్‌ మోంగియా, చేతన్‌ చౌహాన్‌, నిఖిల్‌ చోప్రా, అభయ్‌ కురువిల్లా సెలక్టర్ల రేసులో పోటీపడుతున్నారు. వీరిలో వెంకటేశ్‌ ప్రసాద్‌ (33 టెస్టులు), అగార్కర్‌ (26 టెస్టులు)కు టెస్టులు ఎక్కువ ఆడిన అనుభవం ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
dr madhu
Saket Pranamam
besttaxfiler
HITS2020
VITEEE 2020

Panch Pataka

దేవతార్చన