close

తాజా వార్తలు

అది పాతదే.. అయినా తిరుగులేనిది!

బెంగళూరు: 130 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో యార్కర్‌ ఆనాటి నుంచి ఉన్నా.. నేటికీ బౌలర్లకు అదే ప్రధానాస్త్రమని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ‘‘ఆసీస్‌ సిరీస్‌లో భారత ఆటగాళ్లు గొప్పగా రాణించారు. ముంబయిలో ఓటమిని చవిచూసినా అద్భుతంగా పుంజుకొని సత్తా చాటారు. రాహుల్‌ ఔటైన తర్వాత ఆసీస్‌ వికెట్ల కోసం ప్రయత్నిస్తుందని రోహిత్-విరాట్ గ్రహించి నిలకడగా బ్యాటింగ్‌ చేశారు. ఇద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు. శ్రేయస్‌ కూడా తన సత్తా మరోసారి చాటిచెప్పాడు. భారత బౌలర్లు చివరి పది ఓవర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. యార్కర్లతో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టారు. 130 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో యార్కర్‌ ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో అదే బ్యాట్స్‌మన్‌కు సరైన సమాధానం. ఎటువంటి తప్పిదాలు లేకుండా యార్కర్‌ను సంధిస్తే ఏ బ్యాట్స్‌మన్‌ను అయినా ఔట్ చేయవచ్చు. యువఆటగాళ్లు గొప్పగా రాణిస్తున్నారు. తర్వాత ప్రత్యర్థి ఎవరైనా వారు అదరగొడతారు. సైనికి మంచి ప్రతిభ ఉంది. టీమిండియాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

చిన్నస్వామి స్డేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్టీవ్‌ స్మిత్‌ (131) రాణించడంతో తొలుత ఆసీస్‌ 286 పరుగులు చేసింది. షమి (4/63), జడేజా (2/44) సత్తా చాటారు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. రోహిత్‌శర్మ (119), విరాట్‌ కోహ్లీ (89), శ్రేయస్ అయ్యర్‌ (44*) చెలరేగడంతో 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్‌లో భారత పేసర్లు యార్కర్లతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. బుమ్రా, షమి, సైని యార్కర్లతో డెత్‌ఓవర్లలో సత్తా చాటారు.

ఇదీ చదవండి

చిన్నస్వామిలో రికార్డుల మోత..!


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.