కరోనాను ఐపీఎల్ దాటేసింది

తాజా వార్తలు

Published : 10/12/2020 00:46 IST

కరోనాను ఐపీఎల్ దాటేసింది

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో క్రికెట్‌కు ఎంతో క్రేజ్‌ ఉందని మరోసారి రుజువైంది. ఈ ఏడాది గూగుల్‌లో మహమ్మారి కరోనా వైరస్‌ గురించి కంటే ఐపీఎల్‌ కోసమే భారతీయులు అధికంగా సెర్చ్ చేశారని ‘గూగుల్‌ ఇండియా’ తెలిపింది. 2020లో అత్యధిక మంది ఐపీఎల్‌ గురించే వెతికారని, రెండో స్థానంలో కరోనా ఉందని నివేదికలో వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వరకు జరిగిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఐపీఎల్‌ వీక్షకుల సంఖ్య 28 శాతం పెరిగింది.

అయితే ఐపీఎల్ తర్వాత కరోనా వైరస్, అమెరికా ఎన్నికల ఫలితాలు, ప్రధానమంత్రి కిసాన్‌ పథకం, బిహార్‌, దిల్లీ ఎన్నికల ఫలితాలు, నిర్భయ కేసు, లాక్‌డౌన్‌, భారత్-చైనా వివాదం, రామ్‌మందిర్‌ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక క్రీడలకు సంబంధించి ఐపీఎల్‌ తర్వాత యూఈఎఫ్‌ఎ ఛాంపియన్‌ లీగ్‌, ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్, ఫ్రెంచ్‌ ఓపెన్‌, ల లిగ టాప్‌లో ఉన్నాయి. కాగా, 2019లో దేశంలో ‘ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్’ గురించి ఎక్కువగా సెర్చ్‌ చేశారు.

ఈ ఏడాది వ్యక్తుల గురించి అత్యధికంగా సెర్చ్‌ చేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, సింగర్‌ కనికా కపూర్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్, ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్ ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి కంగన రనౌత్‌, రియా చక్రవర్తి, అంకిత లోఖండే కూడా ట్రెండింగ్‌లో ఉన్నారు. సినిమా, వెబ్‌సిరీస్‌ జాబితాలో దిల్‌ బెచారా, మనీ హైస్ట్‌ వరుసగా టాప్‌లో ఉన్నాయి.

ఇదీ చదవండి

ఆసీస్‌పై విజయానికి కారణమదే

క్రికెట్‌కు పార్థివ్‌ పటేల్‌ గుడ్‌బై


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని