నం.1గా 300 వారాలు

తాజా వార్తలు

Updated : 22/12/2020 07:30 IST

నం.1గా 300 వారాలు

లండన్‌: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ డిసెంబరు 20తో ప్రపంచ నంబర్‌వన్‌గా 300 వారాలు పూర్తి చేసుకున్నాడు. ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న ఫెదరర్‌ను అందుకునేందుకు జకోవిచ్‌కు కావాల్సింది మరో పది వారాలే. ఫెదరర్‌ 310 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్నాడు. 33 ఏళ్ల జకోవిచ్‌ తొలిసారి 2011 జులైలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజయంతో అతడు అయిదోసారి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 

ఇవీ చదవండి..
36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!
8 జట్లతోనే వచ్చే ఐపీఎల్‌!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని