కోహ్లీ, రోహిత్‌ను అలా దెబ్బతీశా..
close

తాజా వార్తలు

Published : 26/12/2020 00:30 IST

కోహ్లీ, రోహిత్‌ను అలా దెబ్బతీశా..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ప్రణాళిక ప్రకారమే టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ను కుప్పకూల్చానని పాక్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ పేర్కొన్నాడు. తాజాగా కమ్రన్‌ అక్మల్‌తో యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 338/4 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఫకర్‌ జమాన్‌(114) శతకంతో మెరిశాడు. అనంతరం టీమ్‌ఇండియా ఛేదనకు దిగినప్పుడు రోహిత్‌, కోహ్లీ, ధావన్‌ను తాను ఔట్‌ చేస్తే ఎంత బాగుంటుందో అని అనుకున్నట్లు ఆమిర్‌ చెప్పాడు.

ఈ క్రమంలోనే తొలుత రోహిత్‌ శర్మ గురించి ఆలోచించానని అన్నాడు. ఇన్‌స్వింగ్‌ బంతిని ఆడడంలో అతడు ఇబ్బంది పడతాడనే విషయం తనకు తెలుసని చెప్పాడు. దాంతో తొలి రెండు బంతులను సహజంగా వేసి.. బంతి స్వింగ్‌ అవ్వడం లేదనే భావన రోహిత్‌కు కలిగించి తర్వాత మూడో బంతిని స్వింగ్‌ చేయాలనే ప్రణాళిక వేసినట్లు ఆమిర్‌ వివరించాడు. అనుకున్నట్లే హిట్‌మ్యాన్‌ మూడో బంతికి ఔటయ్యాడన్నాడు. ఆపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వస్తే మ్యాచ్‌ను 45 ఓవర్లలోనే ముగిస్తాడని దాంతో అతడిని కూడా త్వరగా ఔట్ చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నాడు.

కోహ్లీ క్రీజులోకి రాగానే ఇన్‌స్వింగర్‌ వేశానని, దాంతో తర్వాతి బంతిని కూడా అలాగే వేస్తాననే నమ్మకం కలిగించాలనుకున్నట్లు పాక్‌ పేసర్‌ నాటి విశేషాలను గుర్తుచేసుకున్నాడు. అయితే, అప్పటికే కోహ్లీ తన బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని, అయినా తాను అలాంటి బంతులే వేసి ఔట్‌ చేశానన్నాడు. కోహ్లీ తన బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడని చెప్పాడు. కానీ ఒక బంతి ఎడ్జ్‌ తీసుకొని వెళ్లడంతో షాదాబ్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నట్లు వివరించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో టాప్‌ఆర్డర్‌ విఫలమైనా హార్దిక్‌ పాండ్య(76; 43 బంతుల్లో 4x4, 6x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. దీంతో భారత్‌ 30.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. అలా సర్ఫరాజ్‌ సారథ్యంలో పాక్‌ 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గింది. మరోవైపు ఆమిర్ కొద్ది రోజుల క్రితమే పాక్‌ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
ధోనీ చెప్పినట్లే చేశాడు.. ఆశ్చర్యపోయా 
దుమారం రేపిన సన్నీ!
ఇదేం అంపైరింగో.. బంతి బ్యాట్‌కు‌ తాకినా..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని