close
Array ( ) 1

తాజా వార్తలు

స్లెడ్జింగ్‌: నువ్వు బ్యాటే పట్టావా?

2015 ప్రపంచకప్‌లో వాట్సన్‌ x రియాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌వాట్సన్‌ తనని స్లెడ్జింగ్‌ చేశాడని పాకిస్థాన్‌ పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ పేర్కొన్నాడు. 2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించాడు.  తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన పాక్‌ పేసర్‌ నాటి అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు. 2015 మార్చి 20న ఆడిలేడ్‌లో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఆసీస్‌ పేసర్లు జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌ల ధాటికి 213 పరుగుల స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. అయితే, ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ చివరి బంతికి షాహిద్‌ అఫ్రిది(23) ఔటయ్యాక వాహబ్‌ రియాజ్‌(16) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 

అప్పుడు మిచెల్‌ స్టార్క్‌ వేసే బంతుల్ని తాను సరిగ్గా ఎదుర్కోలేకపోయానని పాక్‌ బౌలర్‌ పేర్కొన్నాడు. దాంతో సమీపంలోని ఆసీస్‌ ఫీల్డర్లు తనని స్లెడ్జింగ్‌ చేశారన్నాడు. అది చిన్నపాటి తెల్ల బంతే కదా.. కొట్టడానికి ప్రయత్నం చెయ్‌ అని అన్నారు. మరుక్షణమే స్లిప్‌లో ఉన్న షేన్‌వాట్సన్‌ దగ్గరికొచ్చి  ‘‘నువ్వు బ్యాటే పట్టుకున్నావా?’’ అన్నట్లు కవ్వించాడు’ అని రియాజ్‌ తెలిపాడు. తర్వాత లక్ష్యసాధనలో ఆసీస్‌ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిందని, షేన్‌వాట్సన్‌ క్రీజులోకి వచ్చాడని రియాజ్‌ అన్నాడు. వాట్సన్‌ కోసమే తానూ ఎదురుచూశానన్నాడు. అప్పటికే రెండు వికెట్లు తీసి జోరుమీదున్న రియాజ్‌.. వాట్సన్‌ను లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలిపాడు. తన బౌలింగ్‌ను ఎదుర్కోడానికి వాట్సన్‌ చాలా కష్టపడ్డాడని, కొన్ని బంతులు అతడి హెల్మెట్‌కు తగిలాయని తెలిపాడు. అప్పుడే తాను ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ముందుకెళ్లి చప్పట్లు కొట్టి ఆడమని చెప్పినట్లు వెల్లడించాడు. కాగా, ఆసీస్‌ స్కోర్‌ 83/3 వద్ద ఉండగా రియాజ్‌ బౌలింగ్‌లో వాట్సన్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రహత్‌ అలీ క్యాచ్‌ జారవిడవడంతో వాట్సన్‌ బతికిపోయి మ్యాచ్‌ను గెలిపించాడు. వాట్సన్‌(66), గ్లెన్‌మాక్స్‌వెల్‌(44) చివరి వరకు క్రీజులో ఉండి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. 

ఈ సంఘటనను గుర్తుచేసుకున్న రియాజ్‌.. అప్పుడు వాట్సన్‌ బ్యాటింగ్‌ చేయడానికి వచ్చేసరికే ఆస్ట్రేలియాను కట్టడి చేసినట్లు వెల్లడించాడు. తాను బ్యాటింగ్‌ చేసేటప్పుడు వాట్సన్‌ కవ్వింపులకు పాల్పడ్డాడని అదే తన బుర్రలో తిరుగుతుండేదని తెలిపాడు. బదులుగా.. వాట్సన్‌కు కూడా బ్యాట్‌ ఉందనే విషయాన్ని తానూ గుర్తు చేశానని, అయినా అతడూ బంతిని తాకలేకపోయాడని చెప్పాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.