
తాజా వార్తలు
కోహ్లీ, రోహిత్ పాక్ లీగ్‌లో ఆడితే బాగుంటుంది..
ఆటల మధ్య రాజకీయాలు తేవొద్దు: ఆమిర్
ఇంటర్నెట్‌డెస్క్: భారత్-పాకిస్థాన్ జట్లు రాజకీయాలను పక్కనపెట్టి ఆటలాడాలని దాయాది పేసర్ మహ్మద్ అమిర్ సూచించాడు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడంతో కొన్నేళ్లుగా క్రికెట్‌తో పాటు అన్ని ఆటలూ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లు వీలు చిక్కినప్పుడల్లా భారత్‌తో క్రికెట్ ఆడాలనే తమ కోరికను బహిరంగంగా వెల్లడిస్తుంటారు. తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌తో మాట్లాడిన అమిర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్) భారత ఆటగాళ్లు ఆడితే బాగుంటుందని చెప్పాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడం తనకిష్టమని అన్నాడు.
‘మేం ఎప్పుడూ ఒకే మాట చెబుతున్నాం. క్రీడాకారులుగా ఇరు దేశాల మధ్య ఒక్క క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని ఆటలూ తిరిగి కొనసాగాలి. అందుకు రాజకీయాలను పక్కనపెట్టాలి. కోహ్లీ, రోహిత్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకి బౌలింగ్ చేయడమంటే నాకిష్టం. అలాగే ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లు.. పీఎస్ఎల్లో భారత ఆటగాళ్లు పాల్గొనాలి. తద్వారా ఆటగాళ్లకు ప్రయోజనం చేకూరడమే కాకుండా క్రికెట్లో నాణ్యత పెరుగుతుంది’ అని అమిర్ వివరించాడు. కాగా, ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహించగా కరోనా పరిస్థితుల కారణంగా దాన్ని లీగ్ దశ వరకే కొనసాగించారు. ఆపై లాక్డౌన్ అమలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ పూర్తయ్యాక పీఎస్ఎల్లో మళ్లీ ప్లేఆఫ్స్‌ను నిర్వహించారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
