close

తాజా వార్తలు

‘భవిష్యత్‌ సూపర్‌స్టార్‌ పంత్‌’

రిషభ్‌కు తగిన సమయం ఇవ్వండి: లారా

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పరిణతి సాధించడానికి తగిన సమయం ఇవ్వాలని వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రయన్‌ లారా, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డారు. స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరిద్దరు మాట్లాడారు. ‘అపారమైన ప్రతిభ పంత్‌కు సొంతం. అతడు భారత్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. తన కల కోసం జీవిస్తున్నాడు. కానీ, అతడి చుట్టూ విమర్శకులు ఉన్నారు. ఐపీఎల్‌ నుంచి అతడిని పరిశీలిస్తున్నా. చేసిన పొరపాటునే పంత్ పునరావృతం చేస్తున్నాడు. చేసిన తప్పుల నుంచి అతడు పాఠాలు నేర్చుకోవాలి. పంత్‌ వయస్సు 22 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నా. అతడికి 24-25 ఏళ్లు ఉంటాయని భావించా. అతడు పరిణతి చెందడానికి సమయం ఇవ్వాలి. 27-30 సంవత్సరాల వయస్సులో అసలైన ఆట వెలుగులోకి వస్తుంది. అతడికి సారథి కోహ్లీ మద్దతు ఉంది. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు పంత్‌ కచ్చితంగా సూపర్‌స్టార్‌ అవుతాడు’ అని పీటర్సన్‌ తెలిపాడు. 

వెస్టిండీస్‌ దిగ్గజం బ్రయన్‌ లారా కూడా పీటర్సన్‌ అభిప్రాయాలతో ఏకీభవించాడు. ‘పంత్‌ ఎంతో దూకుడుగా ఆడతాడు. భారత ప్రజలు ధోనీ స్థానంలో పంత్‌ను అప్పుడే ఊహించుకుంటున్నారు. కానీ, ధోనీ,పంత్‌ శైలి భిన్నమైనవి. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా 8 నుంచి 9 నెలల సమయం ఉంది. టీమిండియా మరో వికెట్‌ కీపర్‌తో బరిలోకి దిగవచ్చు. కానీ, ఇది పంత్‌పై మరింత ఒత్తిడి తీసుకువస్తుంది. పంత్‌కు కోహ్లీ అండగా నిలవడం సరైనదేనని భావిస్తున్నా. టీమిండియా ఎంతో విజయవంతమైన జట్టు. 30 ఏళ్ల ముందు వెస్టిండీస్‌ జట్టు కూడా ఆటగాళ్లు రాణించకపోయినా జట్టులో కొనసాగించేది. ఎందుకంటే జట్టుగా విండీస్ విజయాలు సాధించేది. మీరు గుస్‌ లోగీ వంటి ఆటగాళ్ల పేర్లను ఎక్కువగా విని ఉండరు. వారు అంతగా ఆకట్టుకోలేకపోయారు. కానీ, వారికి తగినంత సమయం ఇచ్చారు. పంత్‌కు కూడా సమయం ఇవ్వాలి’ అని లారా పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌ జరిగిన రెండో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఏడు వికెట్లు నష్టానికి 170 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (54) అర్ధశతకంతో రాణించాడు. పంత్‌ (33*) చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 18.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిమన్స్‌ (67*), లూయిస్‌ (40) రాణించారు. నిర్ణయాత్మక టీ20 బుధవారం ముంబయిలో జరగనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.