close
Array ( ) 1

తాజా వార్తలు

వార్మప్‌లో గెలుపు.. సూపర్‌లో ఓటమి

కొనసాగుతున్న టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ వైఫల్యాలు

బ్రిస్బేన్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఉత్కంఠకర విజయం సాధించింది.  భారత్‌ 107 పరుగులే చేసినా బంతితో స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (3/20) చెలరేగడంతో హర్మన్‌సేన ఆఖరి బంతికి గట్టెక్కింది. ప్రత్యర్థిని 105/7కు పరిమితం చేసింది.

ఆఖరి బంతికి అద్భుతం

ఛేదనలో విండీస్‌ 13 ఓవర్లకు 57/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఓపెనర్‌ లీఆన్‌ కిర్బీ (42)ను దీప్తిశర్మ పెవిలియన్‌కు పంపించి బ్రేక్‌ ఇచ్చింది. మరికాసేపటికే స్టెఫానీ టేలర్‌ (16), చెడీన్‌ నేషన్‌ (0), డియాండ్ర  డాటిన్‌ (1) వెంటవెంటనే ఔటవ్వడంతో కరీబియన్లు 17 ఓవర్లకు 67/5తో కష్టాల్లో పడ్డారు. 19వ ఓవర్లో హేలీ మాథ్యూస్‌ (25), చినెల్‌ హెన్రీ (17) కలిసి మూడు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదడంతో సమీకరణం 6 బంతుల్లో 11గా మారింది. పూనమ్‌ వేసిన ఆఖరి ఓవర్‌ రెండో బంతికి హేలీ బౌండరీ బాదింది. నాలుగో బంతికి మాథ్యూస్‌ను పూనమ్‌ ఔట్‌ చేయడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా హెన్రీ క్యాచ్‌ను వేద కృష్ణమూర్తి చక్కగా ఒడిసిపట్టింది.

టాప్‌ ఆర్డర్‌ విఫలం

అంతకుముందు టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. ఓపెనర్‌ స్మృతి మంధాన (4), జెమీమా (0) త్వరగా ఔటయ్యారు. రెండు బౌండరీలు బాదిన డ్యాషింగ్‌ ఓపెనర్‌ షెఫాలి వర్మను షామిలా కనెల్‌  (2/20) పెవిలియన్‌ పంపడంతో భారత్‌ 3.1 ఓవర్లకు 17/3తో నిలిచింది. సారథి హర్మన్‌ప్రీత్‌ (11)సైతం క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. మరి కాసేపటికే వేద కృష్ణమూర్తి (5)ని అఫి ఫ్లెచర్‌ (1/26) ఔట్‌ చేయడంతో  11.2 ఓవర్లకు టీమ్‌ఇండియా 52/5తో కష్టాల్లో పడింది. అయితే దీప్తి శర్మ (21; 32 బంతుల్లో), పూజా వస్త్రకర్‌ (13), తానియా భాటియా (10) ఆఖర్లో శిఖా పాండే (24; 16 బంతుల్లో) పోరాడటంతో భారత్‌ 107 పరుగులు చేసింది.

సూపర్‌ ఓవర్లో ఓటమి

సన్నాహక మ్యాచ్‌ ముగిసిన వెంటనే రెండు జట్లు సూపర్‌ ఓవర్‌ను సాధన చేశాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ వికెట్‌ నష్టపోయి 12 పరుగులు చేసింది. 13 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. నాలుగు బంతుల్లో రెండు వికెట్లు చేజార్చుకుంది. జట్టు బ్యాటింగ్‌ వైఫల్యాన్ని ఇది సూచిస్తోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.