close

తాజా వార్తలు

మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు: సీపీ

హైదరాబాద్‌: ఉప్పల్‌ క్రికెట్‌ మైదానంలో శుక్రవారం జరిగే భారత్‌ - వెస్టిండిస్‌ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా స్టేడియాన్ని పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉప్పల్‌లో సాయంత్రం 7గంటలకు భారత్‌ - వెస్టిండిస్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. కొత్తగా ఎన్నికైన హెచ్‌సీఏ నేతృత్వంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఇది. 40వేల మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించొచ్చు’’ అని అన్నారు.

డిసెంబర్‌ 6న బ్లాక్‌డే నేపథ్యంలో నగరవ్యాప్తంగా  భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ‘‘ 1800 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు నిర్వహిస్తున్నాం. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానుల వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం కూడా ఉంది. రేపు రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు సేవలందిస్తాయి. సిగరెట్లు, ల్యాప్‌టాప్‌లు, హెల్మెట్‌లు, అగ్గిపెట్టెలు, బైనాకులర్స్‌, బ్యాగులు, బ్యానర్లు, లైటర్లు, కాయిన్స్‌, ఆహార పదార్థాలు, పెన్నులు నిషేధం. జాతీయ జెండా తప్ప ఏ ఇతర జెండాలూ స్టేడియంలోకి అనుమతించం. మహిళల రక్షణ కోసం షీ టీం బృందాలను కూడా నియమించాం. స్టేడియం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఎలాంటి అసౌకర్యం కలిగినా 100 నంబర్‌కు డయల్‌ చేయండి’’ అని భగవత్ విజ్ఞప్తి చేశారు.

పోలీసులకు సహకరించండి: అజహరుద్దీన్‌
కొత్తగా ఎన్నికైన హెచ్‌సీఏ ఆధ్వర్యంలో తొలి మ్యాచ్‌ రేపు జరగనుందని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ అన్నారు. పోలీసుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయన్నారు. మ్యాచ్‌ జరిగే సమయాల్లో ఆటగాళ్లతో ఎవరూ దుర్భాషలు ఆడొద్దని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలు సరిగా ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని చెప్పారు. ‘‘మ్యాచ్‌ల నిర్వహణతో హైదరాబాద్‌ బ్రాండ్‌ పెరుగుతుంది. హైదరాబాద్‌ యువతను క్రికెట్‌లో కూడా ప్రోత్సహించవచ్చు. ఇప్పటివరకు 24వేల టికెట్లు అమ్ముడయ్యాయి’’ అని అజహరుద్దీన్‌ తెలిపారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.