close
Array ( ) 1

తాజా వార్తలు

Jrద్రవిడ్‌ అదుర్స్‌: 2నెలల్లో 2 డబుల్‌ సెంచరీలు

ముంబయి: మైదానంలో పరుగుల వరద పారిస్తున్న సమిత్‌ ద్రవిడ్‌ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌కు పుత్రోత్సాహం కలిగిస్తున్నాడు. రెండు నెలల వ్యవధిలోనే రెండో డబుల్‌ సెంచరీ చేసి అదరగొట్టాడు. మాల్యా అదితి అంతర్జాతీయ పాఠశాల తరఫున అండర్‌-14 బీటీఆర్‌ షీల్డ్‌ మ్యాచులో శ్రీ కుమారన్‌ జట్టుపై అద్వితీయ ద్విశతకం సాధించాడు. 33 బౌండరీలు బాది 204 పరుగులు చేశాడు. తన జట్టును 377/3తో నిలిపాడు. ఛేదనలోనూ బంతితో రాణించాడు. రెండు వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లు రాణించడంతో ప్రత్యర్థి జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. సమిత్‌ జట్టు 267 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.

గతేడాది డిసెంబర్లో జరిగిన అండర్‌-14 రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ సమిత్‌ ద్రవిడ్‌ రాణించాడు. కోల్‌కతాలో జరిగిన అండర్‌-14 జోనల్‌ టోర్నీలో వైస్‌ ప్రెసిడింట్స్‌ XI తరఫున ధార్వాడ్‌ జోన్‌పై 201 పరుగులు చేశాడు. 256 బంతులు ఆడిన అతడు 22 బౌండరీలు బాదాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనే అజేయ 94తో నిలిచాడు. బంతితో రాణించి 3 వికెట్లు తీశాడు. గతంలోనూ శతకాలు బాదిన సమిత్‌ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.