close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ రోజు నిద్ర పట్టలేదు: రాహుల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి, పంజాబ్‌ మధ్య గత ఆదివారం జరిగిన మ్యాచ్‌ ఎంత ఉత్కంఠగా సాగిందో తెలిసిందే. రెండు సూపర్‌ ఓవర్ల తర్వాత పంజాబ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్‌ అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌ తర్వాత తన పరిస్థితి గురించి పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్ వెల్లడించాడు. సూపర్‌ ఓవర్‌ ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి తాను నిద్రపోలేదని రాహుల్‌ అన్నాడు. ఆ మ్యాచ్‌ను అంత వరకూ తీసుకువెళ్లాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. సూపర్‌ ఓవర్‌ వరకూ రావడంతోనే తీవ్ర ఒత్తిడి గురయ్యామని వెల్లడించాడు. అయితే.. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 
ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్‌ కూడా 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేయగలిగింది. రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. నిబంధనల ప్రకారం సూపర్‌ ఓవర్‌కు వెళ్లాల్సి వచ్చింది. అనూహ్యంగా ఆ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఆ ఓవర్‌లో పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ మరో రెండు బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో పంజాబ్‌ పైచేయి సాధించింది. అయితే.. అంతకు ముందు జరిగిన కోల్‌కతా, హైదరాబాద్‌ మ్యాచ్‌ కూడా సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లడం గమనార్హం.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.