మెరిసిన ధావన్‌.. రాజస్థాన్‌ లక్ష్యం 162
close

తాజా వార్తలు

Published : 14/10/2020 21:32 IST

మెరిసిన ధావన్‌.. రాజస్థాన్‌ లక్ష్యం 162

దుబాయ్‌: ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ దిల్లీ జట్టు ప్రత్యర్థికి 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పృథ్వీషా (0) తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అజింక్యా రహానె 2(9) సైతం మరోసారి విఫలమయ్యాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా శిఖర్‌ ధావన్‌ 57 (33బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. గబ్బర్‌కు తోడుగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 53 (43బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. ఆఖరి ఓవర్లలో రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేశారు. దీంతో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టలేకపోయారు. ఆల్‌రౌండర్‌ స్టొయినీస్‌ 18 (19బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌ ఇవ్వలేకపోయాడు. కళ్లు చెదిరే సిక్సర్‌తో అంచనాలు పెంచిన అలెక్స్‌ కేరీ14 (13) కూడా తర్వాత నెమ్మదించాడు. దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌ (19/3) దిల్లీని దెబ్బ తీశాడు. ఆఖర్లో ఉనద్కత్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తిక్‌, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని