ధోనీ, కోహ్లీ సరసన నిలిచా: జడేజా

తాజా వార్తలు

Published : 31/12/2020 01:32 IST

ధోనీ, కోహ్లీ సరసన నిలిచా: జడేజా

ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ ఘనత మాజీ సారథి ఎంఎస్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుకున్నారు. తన కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్న నేపథ్యంలో జడేజా ట్వీట్‌ చేశాడు. ధోనీ, కోహ్లీ సరసన నిలిచినందకు ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు.

‘‘దేశం తరఫున మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన మహీ భాయ్‌‌‌, విరాట్‌ సరసన నిలవడం ఎంతో గర్వంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి, అండగా నిలిచిన.. బీసీసీఐ, సహాయ బృందం, సహచర ఆటగాళ్లకి కృతజ్ఞతలు. జైహింద్’’ అని జడ్డూ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున జడేజా 50 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1926 పరుగులు, 216 వికెట్లు; వన్డేల్లో 2411 పరుగులు, 188 వికెట్లు సాధించాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో 217 పరుగులు, 39 వికెట్లు తీశాడు.

ప్రస్తుతం జడేజా సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌, తొలి టీ20లో పరుగుల వరద పారించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ తొలి టీ20లో కంకషన్‌, తొడకండరాల గాయంతో చివరి రెండు టీ20లకు, అడిలైడ్ టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టులో జట్టులో చేరిన అతడు మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించాడు. అర్ధశతకంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. బాక్సింగ్‌ డే టెస్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి

ఇది భారత్‌.. ఎవరికీ తలవంచదు: గావస్కర్‌

కరోనా వేట.. 2020లో ఆటTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని